క్రీడలుSRH vs RCB Tickets | ఉప్పల్‌లో చివ‌రి మ్యాచ్‌కు భారీ క్రేజ్.. బ్లాక్ టికెట్ల...

SRH vs RCB Tickets | ఉప్పల్‌లో చివ‌రి మ్యాచ్‌కు భారీ క్రేజ్.. బ్లాక్ టికెట్ల దందాపై అభిమానుల ఆగ్రహం!

ఉప్పల్ స్టేడియంలో జరగనున్న హైదరాబాద్–బెంగళూరు కీలక మ్యాచ్‌కు భారీ డిమాండ్ నెలకొంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: SRH vs RCB Tickets | ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) జట్ల మధ్య పోరుకు అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సీజన్‌లో ఉప్పల్ వేదికగా ఇదే చివరి మ్యాచ్ కావడంతో టికెట్లకు ఊహించని స్థాయిలో డిమాండ్ పెరిగింది. అయితే ఇదే పరిస్థితిని ఆసరాగా చేసుకుని బ్లాక్ టికెట్ల దందా జోరుగా సాగుతున్నట్లు సమాచారం.

స్టేడియం పరిసర ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు బ్లాక్ టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) కూడా అభిమానుల ఆసక్తిని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమ వేదికల ద్వారా టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

SRH vs RCB Tickets | ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు విక్ర‌యం..

సాధారణంగా వెయ్యి రూపాయల వరకు ఉండే టికెట్‌ను పదివేల రూపాయల వరకు, పదివేల రూపాయల టికెట్‌ను లక్ష రూపాయల వరకు విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే కార్పొరేట్ బాక్స్‌లకు కూడా భారీ డిమాండ్ ఏర్పడినట్లు సమాచారం. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం వాటి ధరలు లక్షల రూపాయల వరకు చేరినట్లు తెలుస్తోంది. మ్యాచ్ టికెట్ల విక్రయం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే అన్ని టికెట్లు పూర్తిగా అమ్ముడుపోయినట్లు సమాచారం. కేవలం కొన్ని నిమిషాల్లోనే దాదాపు 39 వేల టికెట్లు బుక్ అయినట్లు తెలుస్తోంది. అయితే మొత్తం ఎన్ని టికెట్లు అధికారికంగా విక్రయించారనే విషయంపై నిర్వాహకుల నుంచి ఇంకా పూర్తి వివరాలు వెలువడలేదు.

SRH vs RCB Tickets | అభిమానుల అసంతృప్తి

ఇదిలా ఉండగా సామాజిక మాధ్యమాల్లో టికెట్ల విక్రయ ప్రకటనలు ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. నకిలీ లేదా బ్లాక్ టికెట్ల పేరుతో మోసాలకు పాల్పడే అవకాశాలు ఉన్నందున అభిమానులు అధికారిక వేదికల ద్వారానే టికెట్లు కొనుగోలు చేయాలని సూచనలు వెలువడుతున్నాయి. ఇక భారీ ధరలకు టికెట్లు విక్రయించడం పట్ల క్రికెట్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అభిమానుల భావోద్వేగాలను వ్యాపారంగా మార్చడం సరైంది కాదంటూ పలువురు మండిపడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే అటు ఎస్ఆర్‌హెచ్‌, ఇటు ఆర్సీబీ జ‌ట్లు ప్లే ఆఫ్స్‌కి చేరుకున్న క్ర‌మంలో ఈ మ్యాచ్ లో అంత మ‌జా ఉండ‌క‌పోవ‌చ్చు అని కొంద‌రు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Chennai Out IPL 2026 | ఘోరంగా సీజ‌న్‌ని ముగించిన చెన్నై.. టాప్‌లో ఆర్సీబీ

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Mopal Police Arrest | ఉద్యోగులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న నిందితుడి అరెస్టు

అక్షరటుడే, డిచ్​పల్లి(మోపాల్): Mopal Police Arrest | నిజామాబాద్​ జిల్లా మోపాల్...

Jukkal MLA Comments | పోలీస్ vs ప్రజాప్రతినిధులు! అధికార పక్షంలో నివురుగప్పిన నిప్పులా ‘మాఫియా’ వివాదం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Jukkal MLA Comments | తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు...

SRH vs RCB | IPL 2026: హైదరాబాద్ భారీ లక్ష్యం.. పవర్‌ప్లేలోనే ఆర్సీబీ కీలక వికెట్లు డౌన్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH vs RCB | రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో...

NIMS Kidney Transplants | కిడ్నీ ట్రాన్స్​ప్లాంట్స్​లో నిమ్స్​ అరుదైన రికార్డు.. 2K మైలురాయి పూర్తి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: NIMS Kidney Transplants | కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్స్...