అక్షరటుడే, వెబ్‌డెస్క్: Delimitation Debate | దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల స్థానాలను కేటాయిస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే వాదనలు రాజకీయ వర్గాల్లో తీవ్రంగా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం, ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) మధ్య సామాజిక మాధ్యమ వేదికలో ఆసక్తికర చర్చ జరిగింది. ముందుగా ఈ అంశంపై స్పందించిన చిదంబరం, నియోజకవర్గాల పునర్విభజనపై వ్యాఖ్యానించే ముందు మంత్రి లోకేష్ వాస్తవాలను, లెక్కలను పరిశీలించుకోవాలని సూచించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం ఎలాంటి మార్పులు చేయకుండా పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ ప్రాతినిధ్యం తగ్గిపోతుందని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం దక్కే అవకాశముందని అభిప్రాయపడ్డారు.
Delimitation Debate | ఎక్స్ వేదికగా మాటల యుద్ధం..
దీనికి స్పందించిన నారా లోకేష్, రాజ్యాంగ నిబంధనల ప్రకారం గతంలో 1971 జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంట్ స్థానాల కేటాయింపును స్తంభింపజేశారని గుర్తు చేశారు. ఈ గడువు 2026 తర్వాత జరిగే మొదటి జనాభా గణనతో ముగుస్తుందని వివరించారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అవుతుందని తెలిపారు. అలాగే జనాభా ఆధారంగా స్థానాల కేటాయింపు జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తమ సాపేక్ష ప్రాతినిధ్యాన్ని కోల్పోయే అవకాశం ఉందనే ఆందోళన తమకూ ఉందని పేర్కొన్నారు. ఈ అసమతుల్యతను సరిచేసేందుకే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో డీలిమిటేషన్‌కు సంబంధించిన బిల్లును తీసుకువచ్చిందని వివరించారు.
Delimitation Debate | రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ
అన్ని రాష్ట్రాలకు దామాషా ప్రకారం స్థానాలను పెంచడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం జరిగిందని లోకేష్ తెలిపారు. చిదంబరం వంటి అనుభవజ్ఞుడైన నాయకుడికి ఈ రాజ్యాంగపరమైన అంశాలు తెలిసే ఉంటాయని వ్యాఖ్యానిస్తూ, కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఆ బిల్లును ఎందుకు వ్యతిరేకించిందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఇక రాజకీయ ప్రయోజనాల కోసం దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కాంగ్రెస్ పార్టీ పణంగా పెడుతోందని కూడా లోకేష్ ఆరోపించారు. మొత్తానికి ఈ ఇద్దరు నేతల మధ్య జరిగిన ఈ చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. డీలిమిటేషన్ అంశం రానున్న రోజుల్లో మరింత రాజకీయ వేడి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి..: AP FDC ఛైర్మన్‌గా భరత్ భూషణ్.. వైస్ ఛైర్మన్‌గా మెహర్ రమేష్.. డైరెక్టర్లుగా మరో 14 మంది నియామకం


