అక్షరటుడే, అమరావతి: Chandrababu Naidu Award | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naiduకు మరో ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది. ప్రముఖ మీడియా సంస్థ The Economic Times ప్రకటించిన ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025’ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు.
Chandrababu Naidu Award | Nirmala Sitharaman చేతుల మీదుగా
ముంబైలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి Nirmala Sitharaman చేతుల మీదుగా ఈ అవార్డును చంద్రబాబు నాయుడు అందుకున్నారు. వ్యాపార, పెట్టుబడుల ప్రోత్సాహం, పరిపాలనా సంస్కరణల్లో ఆయన చూపిన నాయకత్వానికి గుర్తింపుగా ఈ అవార్డు ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమల అభివృద్ధికి అనుకూల విధానాలు అమలు చేయడం వంటి అంశాల్లో తీసుకున్న చర్యలు ఈ గుర్తింపుకు కారణమయ్యాయి. ఈ అవార్డు ద్వారా దేశవ్యాప్తంగా ఆయన నాయకత్వానికి మరోసారి గుర్తింపు లభించింది.

CM Chandrababu Naidu | బిజినెస్ రిఫార్మర్ చంద్రబాబు.. రేపు ముంబైలో ప్రతిష్టాత్మక పురస్కారం!

