అక్షరటుడే, కృష్ణా జిల్లా: Chandrababu Pension Scheme | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రాత్రిపగలు కష్టపడుతున్నామని, ప్రజల ముఖాల్లో చిరునవ్వు చూడటమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం కృష్ణా జిల్లా (Krishna District) పమిడిముక్కలలో ఏర్పాటు చేసిన ‘పేదల సేవ’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
Chandrababu Pension Scheme | రాష్ట్ర అభివృద్ధే లక్ష్యం:
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, ఏపీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పడుతున్న శ్రమను ప్రజల సంతోషం ముందు మర్చిపోతున్నానని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు.
Chandrababu Pension Scheme | వితంతువులకు ఏటా రూ.33 వేల కోట్లు:
వృద్ధులు, వితంతువుల సంక్షేమం కోసం ఏటా రూ.33 వేల కోట్లు పింఛన్ల కోసం ఖర్చు చేస్తున్నామని.. దీన్ని భారంగా కాకుండా ఒక బాధ్యతగా నిర్వహిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. దేశంలోని మరే రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున పింఛన్ల పంపిణీకి నిధులు కేటాయించడం లేదని ఆయన గుర్తుచేశారు.
Chandrababu Pension Scheme | స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లుగా:
కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ‘లేబర్ అడ్డాల’ను నిర్మిస్తున్నామని, ఇవి భవిష్యత్తులో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లుగా (నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు) మారతాయని చంద్రబాబు (CM Chandrababu) వెల్లడించారు. పని లేని రోజుల్లో కార్మికులు ఇక్కడ తమ వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని, తద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ఆకాంక్షించారు.
ఇది కూడా చదవండి..: Kurnool Student Suicide | ఆర్థిక ఇబ్బందులతో అమెరికాలో కర్నూలు విద్యార్థి ఆత్మహత్య

