Leopard in SV University | ఎస్వీ యూనివర్సిటీలో చిరుత కలకలం

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుత కలకలం రేపింది. వర్సిటీలోని చొప్పల రత్నం బిల్డింగ్ సమీపంలో ఐబ్లాక్, జి బ్లాక్ మధ్యలో చిరుత కనిపించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Leopard in SV University | తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుత కలకలం రేపింది. వర్సిటీలోని చొప్పల రత్నం బిల్డింగ్ సమీపంలో ఐబ్లాక్, జి బ్లాక్ మధ్యలో చిరుత కనిపించింది.

చిరుతను చూసిన సిబ్బంది అట‌వీ అధికారులకు సమాచారం అందించారు. వారు అక్కడకు వెళ్లేలోగా అది అడ‌విలోకి వెళ్లిపోయింది. యూనివర్సిటీలో తరచూ చిరుత పులులు సంచరిస్తుండటంతో విద్యార్థులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. గతంలో సైతం పలుమార్లు వర్సిటీ ప్రాంగణంలో చిరుత సంచరించింది. ఇటీవల ఎలుగు బంటి వచ్చింది.

Leopard in SV University | ఫారెస్ట్ అధికారుల చర్యలు

Leopard in SV University

తిరుపతి (Tirupati) లోని మెట్ల మార్గంలో సైతం గతంలో పలుమార్లు చిరుత కనిపించింది. ఇటీవల ఘాట్​రోడ్డులో దర్శనం ఇచ్చింది. ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగణంలోకి తరచూ చిరుత పులులు వస్తున్నాయి. అవి ఆహారం కోసం వ‌చ్చే కుక్క‌ల‌ను అనుస‌రిస్తూ వ‌స్తున్నాయ‌ని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. చిరుతలు రాకుండా చర్యలు చేపడుతున్నారు. వాటిని పట్టుకోవడానికి బోన్లు ఏర్పాటు చేస్తున్నారు

ఇది కూడా చదవండి..: Oman Ship Attack | ఒమన్ తీరంలో నౌకపై అమెరికా దాడి: విశాఖకు చెందిన మెరైన్ చీఫ్ ఇంజినీర్ దుర్మరణం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *