Stock Market Gains | లాభాల్లో స్టాక్ మార్కెట్

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Gains | గ్లోబల్ మార్కెట్ల నుంచి అందుతున్న సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) శుక్రవారం లాభాలతో సాగుతోంది. ఉదయం సెన్సెక్స్ 77 పాయింట్ల లాభంతో ప్రారంభమై మొదట్లో 30 పాయింట్లు తగ్గింది. ఎగబాకింది. నిఫ్టీ 17 పాయింట్ల లాభంతో ప్రారంభమె మరో 129 పాయింట్లు పెరిగింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 357 పాయింట్ల లాభంతో 75,540 వద్ద, నిఫ్టీ 97 పాయింట్ల లాభంతో 23,751 వద్ద ఉన్నాయి.

Stock Market Gains | బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్‌లో కొనుగోళ్లు..

నిఫ్టీ (Nifty)లో కన్జూమర్ డ్యూరెబుల్ ఇండెక్స్ 1.07 శాతం, బ్యాంక్ నిఫ్టీ 1.02 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.89 శాతం, టెలికాం 0.82 శాతం లాభంతో కదలాడుతుండగా.. మీడియా ఇండెక్స్ 1.08 శాతం, ఫార్మా 0.82 శాతం నష్టంతో ఉన్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 24 స్టాక్స్ లాభాలతో, 6 స్టాక్ట్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఆసియన్ పెయింట్ 2.26 శాతం, ట్రెంట్ 2.01 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.71 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.45 శాతం, హెచ్ డీఎఫ్‌సీ బ్యాంక్ 1.26 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : సన్‌ఫార్మా 1.43 శాతం, పవర్‌గ్రిడ్ 1.42 శాతం, ఐటీసీ 1.30 శాతం, బీఈఎల్ 0.68 శాతం, ఎయిర్‌టెల్ 0.48 శాతం నష్టంతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Name Confusion Stocks | కలిసొచ్చిన ‘పేరు’.. కాసులు కురిపించిన షేరు..

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *