Vaibhav Suryavanshi Captain | క్రీడా చరిత్రలో వైభవ్ సూర్యవంశీ సంచలనం.. 15 ఏళ్ల వయసులోనే బీహార్ టీ20 కెప్టెన్‌గా అవకాశం.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి జట్టు ప్రకటన!

ఈ కెప్టెన్సీ అతనిలోని లీడర్‌షిప్ క్వాలిటీస్‌ను మరింత పెంచుతుందని, అతడి సారథ్యంలో బీహార్ జట్టు ఉత్తమ ప్రదర్శన ఇస్తుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vaibhav Suryavanshi Captain | భారత దేశవాళీ క్రికెట్‌లో ఓ అరుదైన, సంచలనాత్మక ఘట్టం నమోదైంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026-27 సీజన్ కోసం బీహార్ Bihar క్రికెట్ అసోసియేషన్ (BCA) ప్రకటించిన 17 మంది సభ్యుల సీనియర్ జట్టుకు 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సారథిగా ఎంపికయ్యాడు.

బీసీఏ సెలక్షన్ కమిటీ శుక్రవారం (నవంబర్ 6) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దీంతో అత్యంత పిన్న వయసులోనే సీనియర్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించబోతున్న ఆటగాడిగా వైభవ్ చారిత్రాత్మక రికార్డు సృష్టించాడు. ఈ జట్టుకు సూరజ్ కశ్యప్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

Vaibhav Suryavanshi Captain | వైభవ్ నాయకత్వంపై బీసీఏ ప్రశంసలు

కేవలం 15 ఏళ్లకే సీనియర్ టీమ్‌ను నడిపించే బాధ్యత వైభవ్‌కు దక్కడంతో బీసీఏ అధ్యక్షుడు హర్ష్ వర్ధన్ స్పందించారు. వైభవ్ చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభతో పాటు అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని, మెచ్యూరిటీని కనబరిచాడని కొనియాడారు.

ఈ కెప్టెన్సీ అతనిలోని లీడర్‌షిప్ క్వాలిటీస్‌ను మరింత పెంచుతుందని, అతడి సారథ్యంలో బీహార్ జట్టు ఉత్తమ ప్రదర్శన ఇస్తుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Vaibhav Suryavanshi Captain | నవంబర్ 14 నుంచి టోర్నీ ప్రారంభం..

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026-27 సీజన్ నవంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో బీహార్ జట్టు ‘గ్రూప్-బి’ లో స్థానం పొందింది. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, తమిళనాడు, సౌరాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, రైల్వేస్ వంటి పటిష్టమైన జట్లు కూడా ఇదే గ్రూప్‌లో ఉండటంతో తీవ్ర పోటీ నెలకొననుంది. ఇండోర్ వేదికగా సౌరాష్ట్రతో జరిగే తొలి మ్యాచ్‌తో బీహార్ తన పోరును ప్రారంభించనుంది.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

బీహార్ ఆడే మొదటి రెండు మ్యాచ్‌లకు వైభవ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఆ తర్వాత నవంబర్ నెలాఖరులో జరగనున్న రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నీలో పాల్గొనేందుకు ఇండియా-ఎ జట్టుతో కలవనున్నాడు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *