అక్షరటుడే, వెబ్‌డెస్క్: Virat Kohli 9000 IPL Runs : Virat Kohli అరుదైన ఘనత సాధించాడు. Indian Premier League చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో 9000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఈ మైలురాయిని చేరుకున్న మొదటి ఆటగాడిగా కోహ్లీ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటాడు.
Virat Kohli 9000 IPL Runs : ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు
Royal Challengers Bengaluru (ఆర్సీబీ) తరఫున ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి ఆడుతున్న కోహ్లీ, సంవత్సరాలుగా జట్టుకు ప్రధాన బలంగా నిలుస్తున్నాడు. ఈ క్రమంలోనే లీగ్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ తన స్థానాన్ని మరింత బలపరిచాడు.
ఐపీఎల్‌లో కోహ్లీ ఇప్పటికే ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు అతని పేరిటే ఉంది. 2016 సీజన్‌లో అతను 973 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు.
Virat Kohli 9000 IPL Runs : అత్యధిక సెంచరీలు
ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలోనూ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. స్థిరమైన ప్రదర్శన, అద్భుతమైన కవర్ డ్రైవ్‌లు, ఒత్తిడిలోనూ నిలకడగా ఆడే శైలి అతనిని ఐపీఎల్‌లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా నిలబెట్టాయి.
కోహ్లీ 9000 పరుగుల మైలురాయి చేరుకోవడంతో అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. “లాంగ్ లివ్ ది కింగ్” అంటూ కింగ్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: RCB vs DC IPL : ఆట వన్ సైడ్.. ఓడిన ఢిల్లీ క్యాపిటల్.. ఆర్సీబీ ఘన విజయం


[…] […]
[…] […]