అక్షరటుడే, వెబ్‌డెస్క్ : India Women Gold Medal | ఆసియా గేమ్స్‌లో జరుగుతున్న టీ 20 ఫైనల్లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత ఖాతాలో తొలి గోల్డ్ మెడల్ చేరింది.
కరొగి స్పోర్ట్స్ పార్కులో మంగళవారం శ్రీలంక జరిగిన మ్యాచ్‌లో భారత ప్లేయర్లు సమష్టి ప్రదర్శనతో ఘన విజయం సాధించారు. మొదట బ్యాటర్లు చెలరేగడంతో భారత్ 216 భారీ స్కోర్ చేసింది. 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు ఆది నుంచి ఏ దశలోనే ఆధిపత్యం చూపట్టలేకపోయింది. 18 పరుగులకు తొలి వికెట్ కోల్పోయిన ఆ జట్టు, అనంతరం వరుస విరామాల్లో వికెట్లు చేజార్చుకుంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీప్తీ శర్మ 3, షెఫాలీ వర్మ, శ్రీ చరణి చెరో రెండు వికెట్లు తీశారు. దీంతో లంక జట్టు 69 పరుగులకే ఆలౌట్ అయింది. 147 పరుగుల తేడాతో భారత్ (India) విజయం సాధించింది.ఈ గెలుపుతో ఆసియా గేమ్స్‌లో భారత్ తొలి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు 4 సిల్వర్, రెండు కాంస్య పతకాలు వచ్చాయి. భారత్ ఖాతాలో మొత్తం 7 పతకాలు చేరాయి. క్రికెట్లో భారత్ గోల్డ్, శ్రీలంక సిల్వర్ మెడళ్లు గెలుచుకోగా.. పాకిస్తాన్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
India Women Gold Medal | చెలరేగిన స్మృతి
భారత ఓపెనర్లు లంక బౌలర్లపై విరుచుకపడ్డారు. షెఫాలి వర్మ 29 బంతుల్లో 48 పరుగులు చేసింది. ఇందులో మూడు ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. షెఫాలీ ఔట్ అయినా స్మృతి మందాన దూకుడు తగ్గించలేదు. భారీ షాట్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టింది. 45 బంతుల్లో 79 పరుగులు చేసింది. ఇందులో 5 ఫోర్లు, 7 సిక్సులు ఉన్నాయి. చివర్లో రిచా గోష్ మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. 22 బంతుల్లో 49 పరుగులు చేసింది.
ఇది కూడా చదవండి..: Asian Games Final | పసిడి పోరు.. భారత మహిళల జట్టు భారీ స్కోర్