Marriage Fraud PD Act | పెళ్లిళ్ల పేరిట మోసం.. నిందితుడిపై పీడీ యాక్ట్​

పెళ్లిళ్ల పేరిట మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిపై సైబరాబాద్​ పోలీసులు పీడీ యాక్ట్​ నమోదు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Marriage Fraud PD Act | పెళ్లిళ్ల పేరిట మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిపై సైబరాబాద్​ పోలీసులు (Cyberabad Police) పీడీ యాక్ట్​ నమోదు చేశారు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మంద వెంకట కామేష్​ అలియాస్​ కార్తీక్​రెడ్డి అనే వ్యక్తి బీటెక్​ చదివాడు. తను ఎన్​ఆర్​ఐని అని అతడు మ్యాట్రీమోని సైట్​లలో నమోదు చేసుకునేవాడు. అనంతరం మహిళలకు దగ్గరై పెళ్లి పేరిట మోసాలకు పాల్పడే వాడు. పెళ్లి చేనసుకుంటానని చెప్పి వారిని నమ్మించేవాడు. అనంతరం తనకు అత్యవసరంగా డబ్బులు కావాలని వారికి చెప్పి డబ్బులు తీసుకొని పరారు అయ్యేవాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదులు అందాయి.

Marriage Fraud PD Act | ఆన్​లైన్​ బెట్టింగ్​ కోసం..

మంద వెంకట కామేష్​ 2021 నుంచి 19 మోసాలకు పాల్పడ్డాడు. ఎన్​ఆర్​ఐ అని చెప్పుకుంటూ, నకిలీ గుర్తింపుతో అతడు మహిళలను నమ్మించేవాడు. అంతేగాకుండా వారి క్రెడిట్​ కార్డు, ఇతర బ్యాంక్​ వివరాలు తెలుసుకొని వాటిని అనధికార లావాదేవీలు, ఆన్‌లైన్‌ బెట్టింగ్ కోసం ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు సైబరాబాద్​ పోలీసులు అతడిపై కేసులు నమోదు చేశారు. మరిన్ని మోసాలకు పాల్పడకుండా తాజాగా పీడీ యాక్ట్​ ప్రయోగించారు. అనంతరం చర్లపల్లి సెంట్రల్​ జైలుకు తరలించారు.

ఇది కూడా చదవండి..: Ganesh Immersion MMTS Trains | గణేశ్ నిమజ్జనం కోసం.. స్పెషల్ ఎంఎంటీఎస్​ రైళ్లు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *