అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ORR Tipper Accident | హైదరాబాద్ (Hyderabad) ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ టిప్పర్ డ్రైవర్ మృతి చెందగా.. క్లీనర్ తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఓఆర్ఆర్పై వట్టినాగులపల్లి సమీపంలోని ముందు వెళ్తున్న టిప్పర్ లారీని మరో టిప్పర్ లారీ ఢీకొంది. దీంతో టిప్పర్ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అందులోని డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. క్లీనర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు.
ORR Tipper Accident | భారీగా ట్రాఫిక్ జామ్
ఈ ప్రమాదం కారణంగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించేందుకు పోలీసులు, అధికారులు క్రేన్‌ను ఉపయోగించడంతో 3, 4వ లేన్లను మూసివేయాల్సి వచ్చింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.
దీనిని కూడా చదవండి : ACB case | మెడికల్ లీవ్‌ల కోసం లంచం.. సీనియర్ అకౌంటెంట్‌పై ఏసీబీ కేసు