Coliving Harassment Suicide | కోలివింగ్​లో ప్రియుడి వేధింపులు.. యువతి ఆత్మహత్య

కోలివింగ్‌లో ప్రియుడి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Coliving Harassment Suicide | కోలివింగ్‌లో ప్రియుడి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలి (Gachibowli)లోని ఎలైట్ కోలివింగ్ హాస్టల్‌లో మొల్లి దుర్గ, సాయికుమార్​ కలిసి ఉంటున్నారు. వీరిద్దరు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. హాస్టల్​లో సహజీవనం చేస్తున్నారు. కాగా సాయికుమార్​ డెలివరి ఎగ్జిక్యూటివ్​గా పని చేస్తున్నాడు. యువతిపై అనుమానంతో మద్యం తాగి వచ్చి ఆమెను సాయికుమార్ వేధించేవాడు. దీంతో దీంతో వేధింపులు తాళలేక మనస్తాపంతో హాస్టల్​ ఐదో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. దుర్గ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడు సాయి కుమార్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు.

Coliving Harassment Suicide | పెరుగుతున్న సంస్కృతి

హైదరాబాద్​ (Hyderabad) నగరంలో కోలివింగ్​, సహ జీవన సంస్కృతి పెరుగుతోంది. ఇప్పటి వరకు ప్రేమ పేరుతో యువతి యువకులు అప్పుడప్పుడే కలుసుకునేవారు. అయితే తాజాగా కోలివింగ్ హాస్టళ్లు అందుబాటులోకి రావడంతో కలిసి సహజీవనం చేస్తున్నారు. చదువు, ఉద్యోగాల కోసం నగరాలకు వచ్చిన యువత ఈ విష సంస్కృతికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలాగే పలువురు ఇంటి యజమానులు సైతం సహజీవనం చేసే జంటలకు ఇళ్లు రెంట్​కు ఇస్తున్నారు. కోలివింగ్​ హాస్టళ్లకు అనుమతులు ఇవ్వొద్దని పలువురు కోరుతున్నారు.

దీనిని కూడా చదవండి : House Arson | రుణదాత ఇంటికి నిప్పు.. నిందితుడి అరెస్టు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *