Tiger Movement Surveillance | పులి కదలికలపై డ్రోన్లతో నిఘా

పోలవరం జిల్లా దేవీపట్నం టన్నెల్ సమీపంలో పులి కదలికలపై అటవీ శాఖ అధికారులు రాత్రంతా డ్రోన్లతో నిఘా పెట్టారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tiger Movement Surveillance | ఏపీలోని పోలవరం (Polavaram) జిల్లాలో పెద్దపులి సంచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దేవీపట్నం (Devipatnam) మండలంలోని ముంపు గ్రామం పాత గంగంపాలెం సమీపంలో ఇటీవల పులి 14 ఆవు దూడలపై దాడి చేసి చంపింది. అంతేగాకుండా జిల్లావ్యాప్తంగా తిరుగుతోంది. దీంతో అధికారులు ప్రత్యేక ఆపరేషన్​ ప్రారంభించారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆదేశాలతో పోలవరం జిల్లా దేవీపట్నం టన్నెల్ సమీపంలో పులి కదలికలపై అటవీ శాఖ అధికారులు రాత్రంతా డ్రోన్లతో నిఘా పెట్టారు. బెంగళూరు వన్యప్రాణి నిపుణుల సహాయంతో పులి సమీప గ్రామాల వైపు రాకుండా నియంత్రించారు. పగటిపూట పులి మరింత చురుకుగా మారే అవకాశం ఉన్నందున అధికారులు.. ప్రత్యేక బృందాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. క్షేత్రస్థాయిలో బృందాలకు ఉన్నతాధికారులు సూచనలు చేస్తున్నారు. రాత్రివేళ బయటకు ఒంటరిగా వెళ్లొద్దని గ్రామస్తులకు అటవీశాఖ అధికారులు సూచించారు.

puli

Tiger Movement Surveillance | వరుస దాడులు

పెద్ద పులి పోలవరం జిల్లాలో వరుస దాడులు చేస్తోంది. రాజవొమ్మంగి మండలంలో వారం క్రితం ఏడు మూగజీవులపై దాడి చేసింది. ఇటీవల దేవిపట్నంలో 14 ఆవుదూడలను చంపేసింది. వారం పది రోజులుగా ఇక్కడే పులి సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. దీంతో అది గ్రామాల్లోకి రాకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

దీనిని కూడా చదవండి : TDP Rajya Sabha | కొలిక్కి వచ్చిన టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల కసరత్తు.. ముగ్గురు పేర్లు ఖరారు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *