Trisha in Tirumala | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న త్రిష‌..

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Trisha in Tirumala | దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా గుర్తింపు పొందిన త్రిష కృష్ణన్ (Trisha Krishnan) సోమవారం ఉదయం తిరుమలలోని వేంకటేశ్వర స్వామి (Tirumala Venkateswara Swami) దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకున్నారు.

మే 4న ఆమె పుట్టినరోజు కావడంతో వేకువజామునే సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా సాధారణ భక్తురాలిలా దర్శనం చేసుకోవడం అభిమానులను ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతున్నాయి.

Trisha in Tirumala | తిరుమ‌ల‌లో ప్ర‌త్యేక పూజ‌లు..

అయితే ఈ దర్శనం వెనుక కేవలం పుట్టినరోజు సందర్బమే కాకుండా రాజకీయ కారణం కూడా ఉందంటూ నెటిజన్లు చర్చిస్తున్నారు. అదే రోజున తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల (Tamilnadu Assembly Elections) ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడం విశేషం. తమిళ సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) తొలిసారి ఎన్నికల బరిలోకి దిగింది. ఈ నేపథ్యంలో విజయ్ రాజకీయ భవిష్యత్తుకు ఇది కీలక సమయంగా భావిస్తున్నారు. విజయ్‌కి సన్నిహితురాలిగా పేరున్న త్రిష, ఆయన విజయాన్ని కోరుకుంటూ తిరుమలకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం కారణంగా ఈ ప్రచారం మరింత బలపడుతోంది.

Trisha in Tirumala | విజయ్ పార్టీ ఎంట్రీతో కొత్త మలుపు

ఒకవేళ TVK మంచి ఫలితాలు సాధిస్తే, అదే రోజు త్రిష పుట్టినరోజు కావడంతో అది ఆమెకు డబుల్ సంతోషాన్ని ఇచ్చే సందర్భమవుతుందని అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. ఇక తమిళనాడు రాజకీయాల్లో చాలా కాలంగా కొనసాగుతున్న DMK – AIADMK పోటీగా విజయ్ పార్టీ ఎంట్రీతో కొత్త మలుపు తిరిగింది. ముఖ్యంగా యువతలో ఆయనకు మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్​ ప్రకారం.. TVK పార్టీ 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఏదిఏమైనా ఇప్పుడు త్రిష తిరుమల దర్శనం ఆధ్యాత్మికతతో పాటు రాజకీయ కోణంలో కూడా చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి..: Modi Kashi Visit | కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ పూజలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *