అక్షరటుడే వెబ్‌డెస్క్: Mangalagiri Railway Station | అమృత్ భారత్ స్టేషన్ పథకం (ABSS) కింద రూ. 12.56 కోట్ల వ్యయంతో పునర్‌వ్యవస్థీకరించిన మంగళగిరి రైల్వేస్టేషన్‌ను శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ ( Nara Lokesh ), కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Mangalagiri Railway Station | రైల్వే వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు..
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, దేశ ఆర్థిక, సామాజిక ప్రగతిలో రైల్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. గతంలో భద్రతా లోపాలు ఉన్న రైల్వే వ్యవస్థ, నేడు ప్రధాని మోదీ నాయకత్వంలో ‘కవచ్’ వంటి అత్యాధునిక సాంకేతికతతో విప్లవాత్మక మార్పులను సంతరించుకుందని ప్రశంసించారు.
Mangalagiri Railway Station | అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి..
మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి పలు విజ్ఞప్తులు చేశారు. నియోజకవర్గంలో మరిన్ని రైళ్లు ఆగేలా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవ చూపాలని కోరారు. ప్రముఖ పుణ్యక్షేత్రం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక పథకాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
Mangalagiri Railway Station | అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతాం..
రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని లోకేశ్ స్పష్టం చేశారు. ఇందుకోసం రోడ్డు, రైలు, విమాన రవాణా వ్యవస్థల అనుసంధానం ఎంతో కీలకమని ఆయన తెలిపారు. ప్రభుత్వం రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, సాంకేతికంగా వేగంగా అభివృద్ధి చేస్తోందని, స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేస్తే నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందుతుందనే దానికి మంగళగిరి ఒక ఉదాహరణగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Drinking Water Wastage | తాగునీటి వృథా.. ఒకరికి రూ.5 వేల జరిమానా