ఆంధ్రప్రదేశ్​RTC Diesel Crisis | ఆర్టీసీపై డీజిల్ కొరత ప్రభావం.. అధికారులపై మంత్రి సీరియస్!

RTC Diesel Crisis | ఆర్టీసీపై డీజిల్ కొరత ప్రభావం.. అధికారులపై మంత్రి సీరియస్!

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరత సెగ ఆర్టీసీ బస్సులకు తాకింది. రాష్ట్రవ్యాప్తంగా పలు డిపోల్లో డీజిల్ నిల్వలు నిండుకోవడంతో బస్సు సర్వీసుల నిర్వహణ కష్టతరంగా మారింది.

అక్షరటుడే, అమరావతి: RTC Diesel Crisis | ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో పెట్రోల్, డీజిల్ కొరత సెగ ఆర్టీసీ బస్సులకు తాకింది. రాష్ట్రవ్యాప్తంగా పలు డిపోల్లో డీజిల్ నిల్వలు నిండుకోవడంతో బస్సు సర్వీసుల నిర్వహణ కష్టతరంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో డీజిల్ లేక బస్సులు మార్గమధ్యలోనే నిలిచిపోతుండటంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

RTC Diesel Crisis | మంత్రి సమీక్ష:

డీజిల్ కొరతపై రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి (Ramprasad Reddy) ఉన్నతాధికారులతో అత్యవసరంగా చర్చించారు. ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. డీజిల్ సరఫరాలో ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రయాణికులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

RTC Diesel Crisis | ప్రజలకు విజ్ఞప్తి:

ఈ క్లిష్ట సమయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వానికి , అధికారులకు సహకరించాలని మంత్రి కోరారు. ఇంధన సరఫరాను పునరుద్ధరించడానికి చమురు సంస్థలతో సమన్వయం చేసుకుంటూ, త్వరలోనే పరిస్థితిని చక్కదిద్దుతామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: AP Fuel Crisis | ఏపీలో పెట్రోల్, డీజిల్ సంక్షోభం.. బంకులు మూసివేత‌, అక్క‌డ మాత్రం ఉచిత ఇంధన పంపిణీ

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....

Modi UAE Visit | ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. యూఏఈలో కీలక భేటీ!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Modi UAE Visit | ఐరోపా దేశాల్లో వచ్చే నెల...