TDP Rajya Sabha | కొలిక్కి వచ్చిన టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల కసరత్తు.. ముగ్గురు పేర్లు ఖరారు

రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై గత కొంతకాలంగా పార్టీ స్థాయిలో విస్తృతంగా చర్చలు జరిగినట్లు సమాచారం. సామాజిక, రాజకీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: TDP Rajya Sabha | తెలుగుదేశం పార్టీ (టీడీపీ) రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చింది. పార్టీ తరఫున రాజ్యసభకు పంపనున్న అభ్యర్థుల పేర్లను అధిష్ఠానం ఖరారు చేసినట్లు సమాచారం.

టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ పేర్లు దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ముగ్గురు నేతల పేర్లపై పార్టీ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

akshara today .jpgtdp ap

TDP Rajya Sabha | విస్తృతంగా చర్చలు

రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై గత కొంతకాలంగా పార్టీ స్థాయిలో విస్తృతంగా చర్చలు జరిగినట్లు సమాచారం. సామాజిక, రాజకీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

అభ్యర్థుల పేర్లపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

Kerala fake study certificates | “డిగ్రీల దుకాణం”: చదివినవాడు నిరుద్యోగి… ముద్రించేవాడు నిపుణుడు!

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *