అక్షరటుడే, వెబ్‌డెస్క్: Metro Viral Book | ఒకప్పుడు మెట్రో ప్రయాణాల్లో మొబైల్ ఫోన్లకే పరిమితమైన ప్రయాణికులు.. ఇప్పుడు పుస్తకాలు చదువుతూ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫొటో మాత్రం నవ్వులు పూయించడంతో పాటు చర్చకు కూడా దారి తీసింది.
Metro Viral Book | పురుషులను చంపి, ఎలా బయటపడాలి..
కొద్ది రోజుల క్రితం మెట్రో రైలులో ఓ యువతి “How to Kill Men and Get Away With It” అనే పుస్తకం చదువుతున్న ఫొటో వైరల్‌గా మారింది. ఆ ఫొటోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొందరు దాన్ని కేవలం నవలగా పేర్కొంటే, మరికొందరు టైటిల్‌పై సరదాగా మీమ్స్, కామెంట్లు చేశారు.
ఇప్పుడు అదే తరహాలో మరో ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈసారి ఓ వ్యక్తి ‘భార్యను బొందపెట్టడం ఎలా?’ అనే అర్థం వచ్చే శీర్షికతో ఉన్న పుస్తకాన్ని చదువుతూ కనిపించాడు. దీంతో సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది.
Metro Viral Book | సరైన కౌంటర్ అంటూ..
“కౌంటర్ పర్ఫెక్ట్‌గా పడింది!”, “మెట్రోలో ఇప్పుడు పుస్తకాల యుద్ధం మొదలైంది”, “టైటిల్ చూసి భయపడొద్దు… లోపల కథ వేరే అయి ఉండొచ్చు” అంటూ నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. మరికొందరు మాత్రం, నేటి సమాజంలో మహిళలపై, పురుషులపై పెరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఇలాంటి సంచలనాత్మక శీర్షికలున్న పుస్తకాలు, వాటిపై చేసే సరదా పోస్టులను కూడా బాధ్యతతో చూడాలని సూచిస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి ఫొటో వెనుక ఉన్న సందర్భం పూర్తిగా తెలియకపోవచ్చు. అయినప్పటికీ, విభిన్న శీర్షికలతో ఉన్న పుస్తకాలు ప్రయాణికుల దృష్టిని ఆకర్షించడం, వాటిపై నెటిజన్లు మీమ్స్, జోకులు పంచుకోవడం మాత్రం ఇప్పుడు కొత్త ట్రెండ్‌గా మారిందని చెప్పాలి.