Amit Bapna Arrest | రిలయన్స్ ఏడీఏ గ్రూప్ కేసులో కీలక పరిణామం.. మాజీ సీఎఫ్‌వో అమిత్ బాప్నా అరెస్టు

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Amit Bapna Arrest | రిలయన్స్ ఏడీఏ గ్రూప్‌నకు సంబంధించిన ఆర్థిక అక్రమాల కేసుల దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) అమిత్ బాప్నాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శుక్రవారం అరెస్టు చేసింది.

ప్రస్తుతం మరో కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న ఆయనను ప్రొడక్షన్ వారెంట్‌పై ముంబయి ప్రత్యేక సీబీఐ కోర్టు ఎదుట హాజరుపరచగా.. కోర్టు నాలుగు రోజుల సీబీఐ కస్టడీ మంజూరు చేసింది.

Telangana Telugu History | ఆంధ్రుల భాష ‘ఆంధ్రం’… మనది ‘జాన తెలుగు’!: “ఇడుపు కాయితం” Title లొల్లి వేళ ఆకట్టుకుంటున్న ప్రొఫెసర్ దంటు కనకదుర్గ విశ్లేషణ

Amit Bapna Arrest | నిబంధనలకు విరుద్ధంగా రుణాల మంజూరు

సీబీఐ దర్యాప్తు ప్రకారం, అమిత్ బాప్నా ఆగస్టు 2014 నుంచి డిసెంబర్ 2019 వరకు రిలయన్స్ క్యాపిటల్ సీఎఫ్‌వోగా పనిచేస్తూ సంస్థ ఆర్థిక వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే బాధ్యతలు నిర్వర్తించారు.

ఈ కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మార్గదర్శకాలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు విధించిన రుణ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ మధ్యవర్తి, కాన్డ్యుట్ కంపెనీలకు రుణాల మంజూరుకు ఆయన అనుమతులు ఇచ్చినట్లు దర్యాప్తులో తేలినట్లు సీబీఐ వెల్లడించింది.

దర్యాప్తులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్‌సీఎఫ్‌ఎల్) ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి సమీకరించిన నిధులను మధ్యవర్తి సంస్థల ద్వారా మళ్లించి, రిలయన్స్ ఏడీఏ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, రిలయన్స్ పవర్ లిమిటెడ్ తదితర సంస్థలకు బదిలీ చేసినట్లు సీబీఐ ఆరోపించింది.

ఈ చర్యల వల్ల రుణాలు ఇచ్చిన బ్యాంకులకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లగా, సంబంధిత వ్యక్తులు, అనుబంధ సంస్థలు అక్రమంగా లబ్ధి పొందినట్లు పేర్కొంది.

Amit Bapna Arrest | తీహార్ కేంద్ర కారాగారంలో

ఇప్పటికే ఇదే వ్యవహారానికి సంబంధించిన మరో కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతుండగా, అమిత్ బాప్నా ఢిల్లీలోని తీహార్ కేంద్ర కారాగారంలో న్యాయపరమైన కస్టడీలో ఉన్నారు.

ప్రస్తుత కేసులో విచారణ నిమిత్తం ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ ముంబయి ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కోర్టు అనుమతితో ఆయనను అరెస్టు చేసిన సీబీఐ, ఆర్థిక లావాదేవీలు, నిధుల మళ్లింపు, ఇతర కీలక అంశాలపై విచారణను మరింత వేగవంతం చేయనుంది.

రిలయన్స్ ఏడీఏ గ్రూప్‌నకు సంబంధించిన ఆర్థిక అక్రమాల కేసుల్లో ఇది మరో కీలక మలుపుగా భావిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని కీలక వ్యక్తుల పాత్ర, నిధుల ప్రవాహం, నిర్ణయ ప్రక్రియపై సీబీఐ విచారణ కొనసాగుతోంది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *