ACB case | మెడికల్​ లీవ్​ల కోసం లంచం.. సీనియర్​ అకౌంటెంట్​పై ఏసీబీ కేసు

మెడికల్ లీవ్​లు, బిల్లులు ప్రాసెస్​ చేయడం కోసం లంచం తీసుకున్న సీనియర్​ అకౌంటెంట్​పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB case | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. ప్రజలు, కాంట్రాక్టర్లతో పాటు ఉద్యోగుల నుంచి కూడా లంచాలు డిమాండ్​ చేస్తున్నారు. తాజాగా మెడికల్ లీవ్​లు, బిల్లులు ప్రాసెస్​ చేయడం కోసం లంచం తీసుకున్న సీనియర్​ అకౌంటెంట్​పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని సబ్-డివిజనల్ ట్రెజరీ ఆఫీస్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అకౌంటెంట్ కందద వెంకటయ్యపై మంగళవారం ఏసీబీ (ACB) కేసు నమోదు చేసింది. ఓ ఉద్యోగికి సంబంధించిన వైద్య సెలవు, సంబంధిత బిల్లులు/భత్యాలను ప్రాసెస్ చేయడం కోసం నిందితుడు రూ.25 వేల లంచం డిమాండ్​ చేశాడు. ఆగస్టు 14న ఇందులో నుంచి రూ.3 వేలు నగదు రూపంలో స్వీకరించాడు. మిగిలిన రూ. 22 వేల లంచాన్ని ఆగస్టు 18న బాధితుడు ఫోన్‌పే ద్వారా బదిలీ చేశారు. అనంతరం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు తాజాగా కార్యాలయంలో సోదాలు నిర్వహించిన అధికారులు సీనియర్​ అకౌంటెంట్ వెంకటయ్యపై కేసు నమోదు చేశారు.

ACB case | ఆర్టీవో కార్యాలయంలో తనిఖీలు

జగిత్యాల జిల్లాలోని కోరుట్ల (Korutla) రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. సోదాల సమయంలో ఎన్ గిరీష్ కుమార్ అనే రవాణా కానిస్టేబుల్, వాహన ధృవీకరణ పత్రం లేకుండా డ్రైవింగ్ పరీక్ష నిర్వహిస్తూ, వాహనాల రిజిస్ట్రేషన్‌ను తనిఖీ చేస్తున్నట్లు గుర్తించారు. సిబ్బంది ఏజెంట్ల ద్వారా ప్రజల నుండి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేశారు. ఆర్టీఏ కార్యాలయంలో ఏజెంట్లు యథేచ్ఛగా తిరుగుతున్నట్లు అధికారులు గమనించారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

దీనిని కూడా చదవండి : Stock Market Rally | రెండో రోజూ రాణించిన మార్కెట్లు.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *