అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market Rally | ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ ఫలితాల వెల్లడికి ముందు రోజు దేశీయ స్టాక్ మార్కెట్ పరుగులు తీసింది. బ్యాంకింగ్ స్టాక్స్ రాణించడంతో ప్రధాన సూచీలు భారీగా లాభపడ్డాయి. పశ్చిమాసియా నుంచి చమురు ఎగుమతులు పెరగడంతోపాటు సరఫరాలను పెంచుతామని జీ7 దేశాలు పేర్కొనడంతో ముడి చమురు ధరలు దిగిరావడం మార్కెట్లకు కలిసొచ్చింది. దీంతో బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా రెండో సెషన్‌లోనూ లాభాలతో ముగిశాయి.
Stock Market Rally | గ్యాప్ అప్ లో ప్రారంభం..
దేశీయ మార్కెట్లు (Domestic markets) మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 126 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా తొలుత అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొని 124 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని 683 పాయింట్లుపైకి ఎగబాకింది. నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. మొదట్లో 42 పాయింట్లు తగ్గి అక్కడినుంచి కోలుకుని 215 పాయింట్లు పెరిగింది. చివరికి సెన్సెక్స్ 685 పాయింట్ల లాభంతో 73,067 వద్ద, నిఫ్టీ 220 పాయింట్ల లాభంతో 22,776 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market Rally | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ ఈలో నమోదైన కంపెనీలలో 2,816 కంపెనీలు లాభపడగా 1,562 స్టాక్స్ నష్టపోయాయి. 245 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 151 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 153 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 21 కంపెనీలు లాభాలతో, 9 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ట్రెంట్ 12.78 శాతం, కోటక్ బ్యాంక్ 3.59 శాతం, హెచ్యూఎల్ 2.83 శాతం, రిలయన్స్ 2.77 శాతం, ఇండిగో 2.23 శాతం లాభపడ్డాయి.
Top Losers : టెక్ మహీంద్రా 2.30 శాతం, టైటాన్ 1.30 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.95 శాతం, ఐటీసీ 0.76 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.75 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Banking Stocks Rally | రాణిస్తున్న బ్యాంకింగ్ స్టాక్స్.. లాభాల్లో ప్రధాన సూచీలు