Stock Market Today | లాభాల స్వీకరణ.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

వరుసగా నాలుగు రోజుల పాటు ర్యాలీ చేసిన తర్వాత మార్కెట్లలో లాభాల స్వీకరణ కనిపించింది. సెన్సెక్స్ 210 పాయింట్లు, నిఫ్టీ 159 పాయింట్లు నష్టపోయాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Today | దేశీయ స్టాక్ మార్కెట్మం (Domestic Stock Market) గళవారం ఉదయం మిక్స్‌డ్ గా ప్రారంభమైంది. సెన్సెక్స్ 493 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 11 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 932 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 71 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 276 పాయింట్లు కోల్పోయింది. చివరికి సెన్సెక్స్ 210 పాయింట్ల నష్టంతో 78,428 వద్ద, నిఫ్టీ 159 పాయింట్ల నష్టంతో 24,614 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Today | హెవీవెయిట్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి..

వరుసగా నాలుగు రోజుల పాటు ర్యాలీ చేసిన తర్వాత మార్కెట్లలో లాభాల స్వీకరణ కనిపించింది. ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ తీర్మానాలకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ప్రధానంగా హెవీవెయిట్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడితో ప్రధాన సూచీలు పతనమయ్యాయి. రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు సూచీలను కిందికి లాగాయి. పశ్చిమాసియాలో అనిశ్చితితో క్రూడ్ ఆయిల్ ధర మళ్లీ పెరగడమూ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినడానికి ఒక కారణమని భావిస్తున్నారు.

Stock Market Today | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,108 కంపెనీలు లాభపడగా 2,128 స్టాక్స్ నష్టపోయాయి. 196 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 169 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 55 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 16 స్టాక్ లాభపడగా.. 14 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ట్రెంట్ 1.15 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.06 శాతం, బీఈఎల్ 0.94 శాతం, టాటా స్టీల్ 0.58 శాతం, ఎం అండ్ ఎం 0.58 శాతం లాభపడ్డాయి.

Top Losers : హెచ్యూఎల్ 1.70 శాతం, ఎన్టీపీసీ 1.63 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.48 శాతం, రిలయన్స్ 1.22 శాతం, ఇండిగో 1.09 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Greenply TermiVax | ప్లైవుడ్ రంగంలో విప్లవం.. భారత్‌లోనే తొలిసారిగా ‘టెర్మివ్యాక్స్’ టెక్నాలజీని ఆవిష్కరించిన గ్రీన్ ప్లై

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *