అక్షరటుడే, వెబ్‌డెస్క్: MP Arvind | సీఎం రేవంత్‌రెడ్డి ఇంజినీరింగ్ విద్యార్థుల భవిష్యత్ నాశనం చేసేలా మాట్లాడుతున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
ఇంజినీరింగ్ విద్యార్థులపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యలను ఎంపీ ఖండించారు. ఇప్పుడు చదువుకునే వాళ్ల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. లక్షల మంది ఇంజినీరింగ్ విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని సీఎం దెబ్బతీశారన్నారు. పాస్ అయిన విద్యార్థులకు సర్టిఫికెట్ నింపడం రాదని సీఎం అంటున్నారని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్‌తో ఆయన ఆటలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేటీఆర్ సైతం ఇలాగే విద్యార్థులను హేళన చేశారన్నారు.
MP Arvind | బడులను పరిశీలించాలి
విద్యార్థులను భయపెట్టేలా సీఎం వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం ఒక్క ప్రభుత్వ బడిని అయిన పరిశీలించారా అని ప్రశ్నించారు. కనీస వసతులు లేకుండా వందల స్కూళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఉన్నా స్కూళ్లు బాగు చేయకుండా.. కమీషన్ల కోసం కొత్తవి కడుతామన్నారు. గతంలో కేసీఆర్ సైతం ఇలాగే చేశారని ఆరోపించారు. విద్యార్థులను కులాల పేరిట విడగొట్టడానికి గురుకులాలు ఏర్పాటు చేశారన్నారు.
MP Arvind | సొంతంగా నామినేషన్ నింపాలి
ఇంజినీరింగ్ కాలేజీలపై సీఎం ఎప్పుడైనా సమీక్షించారా అని ఎంపీ అర్వింద్ ప్రశ్నించారు. కాలేజీల్లో వసతులు లేకుంటే, ఫ్యాకల్టీ లేకుంటే ఏమైనా చర్యలు తీసుకున్నారా అన్నారు. అవేమి చేయకుండా విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. హైడ్రా పేరిట హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌ను నాశనం చేశారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంతంగా ఎలక్షన్ నామినేషన్ నింపాలని సవాల్ చేశారు. చదువులేని ఆయన విద్యార్థుల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. వెంటనే విద్యాశాఖను ఇతరులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి..: PCC Chief | హరీశ్‌రావు క్షుద్ర పూజలు చేశారు : పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్