Food Safety Raids | కుళ్లిన చికెన్​.. ఆహార పదార్థాలపై బొద్దింకలు.. ఫుట్​ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడ్డ హోటళ్ల బాగోతాలు..

కామారెడ్డి జిల్లావ్యాప్తంగా ఫుడ్​సేఫ్టీ అధికారులు మంగళవారం భారీ తనిఖీలు చేపట్టారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Food Safety Raids | జిల్లావ్యాప్తంగా (Kamareddy) ఫుడ్​సేఫ్టీ అధికారులు మంగళవారం భారీ తనిఖీలు చేపట్టారు. 10 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, సూపర్ మార్కెట్లలో ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు.

Food Safety Raids | వంటగదుల్లో భయానక వాతావరణం..

మెదక్ జిల్లా రామాయంపేట నుంచి కామారెడ్డి జిల్లా సరిహద్దు వరకు 44వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న పెద్ద రెస్టారెంట్లను లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్ నుంచి వచ్చిన 10 మంది స్పెషల్ టీం దాడులు చేసింది. భిక్కనూర్, సదాశివనగర్ ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీల్లో హోటళ్ల నిర్వాకం బట్టబయలైంది. కిచెన్లలో బూజు పట్టిన గోడలు, మురుగు నీరు, ఆహార పదార్థాలపై చెలరేగుతున్న బొద్దింకలు, బల్లులు, పాడైపోయిన, కుళ్లిపోయిన ఆహారం, ఫ్రిజ్​లో నిల్వ ఉంచిన చికెన్, మటన్, చేపలను అస్తవ్యస్తంగా ఉంచిన తీరు చూసి అధికారులు విస్తుపోయారు.

Food Safety Raids | దుర్వాసన వస్తున్నా పట్టించుకోని యాజమాన్యాలు..

కంపు వాసన వస్తున్నా, అపరిశుభ్రంగా ఉన్నా యజమానులు పట్టించుకోవడం లేదని ఫుడ్​సేఫ్టీ అధికారులు గుర్తించారు. హైవే పక్కన ఉన్న ఒక హోటల్ పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉండటంతో నోటీసులు ఇచ్చి సీజ్ చేశారు. మరికొన్ని హోటళ్లకు తీరు మార్చుకోవాలని నోటీసులు జారీ చేశారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువుల శాంపిళ్లను సేకరించి ల్యాబ్ కు పంపారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారి అరవింద్ రెడ్డి మాట్లాడుతూ.. కిచెన్ ను నీట్ గా మార్చేవరకు సీజ్ చేసిన హోటల్ మూసే ఉంటుందని, ఆహార భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ నేత క్రిశాంక్ రిమాండ్ రిజెక్ట్.. కోర్టులో ఊరట! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *