Indur Ranabheri Protest | ‘ఇందూరు రణభేరి’ ధర్నాను విజయవంతం చేయండి

బీజేపీ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో తలపెట్టిన ‘ఇందూరు రణభేరి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా ,బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి కోరారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Indur Ranabheri Protest | బీజేపీ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో తలపెట్టిన ‘ఇందూరు రణభేరి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal),బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి కోరారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి ఆధ్వర్యంలో రణభేరి పోస్టర్లను ఆవిష్కరించారు.

Indur Ranabheri Protest | రూ. వేల కోట్ల బకాయిలు

అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు నెలల తరబడి పెండింగ్‌లో ఉండటంతో లక్షలాది మంది విద్యార్థులు తమ ఉన్నత విద్యను కొనసాగించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి చదువుకుంటుండగా, ప్రభుత్వం ఇప్పటికీ రూ.వేల కోట్ల బకాయిలను విడుదల చేయకపోవడం దారుణమన్నారు. ఫలితంగా అనేకమంది విద్యార్థులు కళాశాలల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందలేకపోతున్నారని, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు.

Indur Ranabheri Protest | పాల్గొననున్న ఎంపీ అర్వింద్

గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెలా ఫీజులు విడుదల చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు జరిగే ‘ఇందూరు రణభేరి’ కార్యక్రమంలో ఎంపీ అర్వింద్​ పాల్గొంటారన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థి సంఘాలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనకర్ లక్ష్మీ నారాయణ, నాగోళ్ల లక్ష్మి నారాయణ,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్, బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి విజయ్ కృష్ణ, కార్పొరేటర్ బెల్లల్ శశాంక్, న్యాలం రాజు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి వేణుగోపాల్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షలు వంశీ గౌడ్, విపుల్ రావు, రాకేష్, రాజ్ గణేష్,నాయకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: CCTNS 2.0 Training | సాంకేతికతతోనే సేవలు వేగం: ఎస్పీ రాజేష్ చంద్ర

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *