Ganesh Immersion MMTS Trains | గణేశ్ నిమజ్జనం కోసం.. స్పెషల్ ఎంఎంటీఎస్​ రైళ్లు

గణేశ్​ నిమజ్జనం నేపథ్యంలో రాత్రివేళ ఎంఎంటీఎస్​ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ganesh Immersion MMTS Trains | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో గణేశ్​ నిమజ్జన శోభాయాత్ర అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వేలాది విగ్రహాలను చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. ఈ వేడుకను చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు.

గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో నగరంలోని ప్రధాన రహదారుల్లో పోలీసులు ఈ నెల 25, 26 తేదీల్లో ట్రాఫిక్​ ఆంక్షలు అమలు చేయనున్నారు. శోభాయాత్ర మార్గంలో ఇతర వాహనాలను అనుమతించరు. దీంతో ప్రజలు నిమజ్జనం తిలకించేందుకు, ఇతర ప్రయాణాల కోసం ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని పోలీసులు కోరారు. ఈ మేరకు ప్రజల కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక ఎంఎంటీఎస్​ రైళ్లను నడపనున్నారు. మెట్రో సేవలను సైతం రాత్రంతా నడపనున్నారు.

Ganesh Immersion MMTS Trains | 8 స్పెషల్ ట్రైన్లు

గణేశ విగ్రహ నిమజ్జన రాత్రి వేళల్లో ఉండే అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని, దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 25, 26తేదీల్లో రాత్రి, 27 తెల్లవారుజామున ప్రత్యేక రైళ్లను నడపనుంది. సికింద్రాబాద్​ నుంచి హైదరాబాద్, హైదరాబాద్​–లింగంపల్లి, లింగంపల్లి–హైదరాబాద్​, హైదరాబాద్​–సికింద్రాబాద్, హైదరాబాద్​–లింగంపల్లి, లింగంపల్లి–ఫలక్​నుమా, ఫలక్​నుమా–సికింద్రాబాద్, సికింద్రాబాద్​–హైదరాబాద్​ మార్గాల్లో ఎంఎంటీఎస్​ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య వీటిని నడపనున్నారు.

ఇది కూడా చదవండి..: Madhapur OYO Hotel Murder| మాదాపూర్‌ ఓయో హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *