అక్షరటుడే, వెబ్డెస్క్: Srivari Rathotsavam | తిరుమల (Tirumala)లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం స్వామి వారి రథోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు మలయప్పస్వామివారి రథోత్సవం నిర్వహించారు. వేలాది మంది భక్తులు రథాన్ని లాగారు. ఉభయదేవేరులతో స్వామివారు రథంపై మాడవీధుల్లో విహరించారు. ఈ వేడుక చూడటానికి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. గ్యాలరీలు అన్ని నిండిపోయాయి. స్వామి వారు రథంపై దర్శనం ఇస్తుండగా.. భక్తులు గోవింద నామస్మరణతో పరవిశించిపోయారు. రథోత్సవం నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది.
Srivari Rathotsavam | రేపటితో ముగింపు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు రేపటితో ముగియనున్నాయి. నేడు సాయంత్రం మలయప్పస్వామి అశ్వవాహనంపై విహరిస్తారు. బుధవారం ఉదయం పుష్కరిణిలో స్వామివారికి చక్రస్నానం చేయిస్తారు. అనంతరం రాత్రి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
ఇది కూడా చదవండి..: YSRCP Protest Vijayawada | వైసీపీ ధర్నా.. విజయవాడలో ఉద్రిక్తత