అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydroponic Cannabis Seizure | విశాఖపట్నంలోని భోగాపురం విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడిపై అనుమానంతో తనిఖీ చేయగా.. అతడి లగేజీ బ్యాగ్‌లో 4.210 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి దొరికింది. దీని విలువ సుమారు రూ. 4 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.
నిందితుడు బ్యాంకాక్‌లో గంజాయి కొనుగోలు చేసి, సింగపూర్ మీదుగా విశాఖపట్నం వచ్చాడు. సాధారణ తనిఖీల సమయంలో అతడి ప్రవర్తనపై అధికారులకు అనుమానంతో క్షుణ్ణంగా పరిశీలించారు. అతడి బ్యాగ్ అడుగున మరో అర ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు దానిని తొలగించి చూడగా.. అడుగున కవర్లలో హైడ్రోఫోనిక్ గంజాయి ఉంది. దీంతో దానిని స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశారు.
Hydroponic Cannabis Seizure | భారీ డిమాండ్
హైడ్రోపోనిక్ గంజాయిని మట్టికి బదులుగా పోషకాలు అధికంగా ఉన్న నీటిని ఉపయోగించి నియంత్రిత వాతావరణంలో సాగు చేస్తారు. ఇది విలువైన రకం, కావడంతో మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో ఇతర దేశాల నుంచి భారత్‌కు తరచూ హైడ్రోఫోనిక్ గంజాయి తీసుకు వస్తున్నారు. ఇటీవల బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికులకు సంబంధించిన ఇలాంటి స్వాధీనాలు ఇతర విమానాశ్రయాల్లో కూడా నమోదయ్యాయి.
భోగాపురం ఎయిర్ పోర్టులో భారీగా గంజాయి పట్టివేత
భోగాపురం విమానాశ్రయంలో అధికారులు భారీగా గంజాయి పట్టుకున్నారు. నిందితుడు బ్యాంకాక్ నుంచి సింగపూర్ మీదుగా విమానంలో భోగాపురం ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు. నిందితుడిని తనిఖీ చేసి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న 4 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి విలువ రూ. 4 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
#bhogapuramairport #cannabusseizure #drugsmuggling #andhrapradesh #airportnews #aksharatoday
— Akshara Today | Telugu News (@AksharaToday) October 25, 2026
దీనిని కూడా చదవండి : TG SAFE Inspections | స్వీట్ షాపులు, బేకరీల్లో టీజీ సేఫ్ అధికారుల తనిఖీలు