అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vizag Beach Tragedy | స్నేహితుల దినోత్సవం రోజు విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు స్నేహితులు సముద్రంలో గల్లంతు అయ్యారు. ఈ ఘటన వైజాగ్ బీచ్‌లో ఆదివారం చోటు చేసుకుంది.
కొంతమంది స్నేహితులు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా వైజాగ్ (Vizag) బీచ్ వెళ్లారు. అక్కడ సరదాగా గడిపారు. అందరు కలిసి ఫొటోలు దిగారు. ఈ క్రమంలో సముద్రం ఒడ్డున రాయిపై నిల్చొని ఫొటో దిగుతుండగా.. పెద్ద అల వచ్చింది. అల ధాటికి పెదజాలరిపేటకు చెందిన నీతు అనే యువతి నీటిలో కొట్టుకుపోయింది. ఆమెను కాపాడటానికి రాము అనే యువకుడు నీళ్లలోకి దిగాడు. అతడు సైతం గల్లంతు అయ్యాడు.
Vizag Beach Tragedy | గాలింపు చర్యలు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరి కోసం గజ ఈతగాళ్లు, బోట్ల సాయంతో గాలిస్తున్నారు. కాగా నీతు, రాము విశాఖ పెదజాలరిపేట చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో సముద్రంలో అలలు ఎగిసి పడుతున్నాయి. బీచ్‌లకు వెళ్లే ప్రజలు నీళ్లలోనికి వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.
ఫ్రెండ్షిప్ డే నాడు తీవ్ర విషాదం
వైజాగ్ బీచ్‌లో అలల తాకిడికి గల్లంతైన ఇద్దరు స్నేహితులు
ఫ్రెండ్షిప్ డే వేడుకల కోసం బీచ్‌కు వెళ్లి ఫొటోలు దిగుతుండగా, ఒక్కసారిగా దూసుకొచ్చిన అల
దీంతో సముద్రంలోకి కొట్టుకుపోయిన పెదజాలరిపేటకు చెందిన నీతు అనే యువతి, నీతును కాపాడబోయి గల్లంతైన రాము… pic.twitter.com/VAAx7xnIC1
— Telugu Scribe (@TeluguScribe) August 2, 2026
ఇది కూడా చదవండి : Nasha Mukt Yuva Abhiyan | యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి : ప్రధాని మోదీ