అక్షరటుడే వెబ్డెస్క్: Kalyani Murder Case | ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ( Ibrahimpatnam )కలకలం రేపిన కళ్యాణి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ దారుణానికి పాల్పడింది ఆమెతో సన్నిహితంగా ఉండే మటన్ షాప్ నిర్వాహకుడు షఫీ అని గుర్తించారు. హౌసింగ్ బోర్డు కాలనీలో మటన్ షాప్ నడిపే షఫీతో కళ్యాణికి సాన్నిహిత్యం ఉందని, అంతేకాదు కళ్యాణి కుమారుడిని కూడా షఫీనే పెంచుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
Kalyani Murder Case | బెదిరింపులే హత్యకు దారితీశాయా?
విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన కళ్యాణి.. తరచూ తనను డబ్బులు ఇవ్వాలని షఫీపై తీవ్ర ఒత్తిడి తెచ్చేదని పోలీసులు తెలిపారు. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే అత్యాచారం కేసు పెడతానంటూ బెదిరిస్తుండటంతో షఫీ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే ఈ నెల 17వ తేదీ రాత్రి తనకు రూ. 20 వేలు కావాలని కళ్యాణి అడగడంతో వివాదం ముదిరింది.
దీంతో ప్రకాశం బ్యారేజ్ సమీపం నుంచి ఆమెను భవానీపురంలోని తన ఇంటికి తీసుకెళ్లిన షఫీ.. అక్కడ కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత తన షాప్లో పనిచేసే గురువులు అనే వ్యక్తిని ఇంటికి పిలిపించుకున్నాడు. ఇద్దరూ కలిసి మద్యం సేవించి, మాంసం కొట్టే కత్తులతో కళ్యాణి మృతదేహాన్ని ముక్కలుగా నరికారు.
Kalyani Murder Case | బ్యాగుల్లో కుక్కి కెనాల్లో పడేసి..
మృతదేహాన్ని ముక్కలుగా మార్చిన అనంతరం వాటిని వేర్వేరు బ్యాగుల్లో సర్దుకుని, గొల్లపూడి వద్ద ఉన్న కూలింగ్ కెనాల్లో పడేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న షఫీ, గురువులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు కళ్యాణితో సన్నిహితంగా మెలిగిన బంగారు షాప్ దామోదర్, కరీం హోటల్ గోస్, ఆల్ఫా హోటల్ అదానీ అలీల పాత్రపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలోనూ లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ హత్య వెనుక మరెవరి ప్రమేయమైనా ఉందా? లేదా మృతదేహాన్ని ముక్కలు చేయడానికి ఇంకెవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఇది కూడా చదవండి: Godavari Pushkar Works | గోదావరి పుష్కర పనులకు అత్యంత ప్రాధాన్యత: కలెక్టర్ భవేష్ మిశ్రా