అక్షరటుడే, ఆర్మూర్ : Dubai Worker Death | ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఆలూర్ మండల (Alur Mandal) కేంద్రానికి చెందిన గడ్డం చరణ్ కరుణాకర్ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ ఘటనతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది.
Dubai Worker Death | ఈనెల 13న దుబాయ్ వెళ్లిన..
ఈనెల 14న దుబాయ్ వెళ్లిన కరుణాకర్.. అక్కడికి వెళ్లిన వారం రోజుల్లోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడు కరుణాకర్‌కు భార్య సునీత (44), ఇద్దరు కుమార్తెలు కావేరి (20), కావ్య (14) ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న కరుణాకర్ మృతితో భార్య, పిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సునీత మాట్లాడుతూ.. తమ భర్త మృతదేహాన్ని దుబాయ్ నుంచి స్వగ్రామానికి తీసుకురావడానికి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, దాతలు సహకరించాలని కోరారు. అంతేకాకుండా తమ కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి..: Godavari Pushkar Works | గోదావరి పుష్కర పనులకు అత్యంత ప్రాధాన్యత: కలెక్టర్ భవేష్ మిశ్రా