అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Raids | ఏసీబీ దూకుడు పెంచింది. అవినీతి అధికారుల పని పడుతోంది. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల మేరకు లంచాలు తీసుకుంటున్న అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటోంది. అంతేగాకుండా భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన అధికారుల నివాసాల్లో సైతం దాడులు చేస్తోంది. తాజాగా భూపాలపల్లి (Bhupalpally) భూగర్భ గనుల శాఖ ఏడీ జయరాజు ఇళ్లలో ఏసీబీ సోదాలు చేపట్టింది.
ACB Raids | 12 ప్రాంతాల్లో..
ఏడీ జయరాజు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు సమాచారం. ఈ మేరకు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. దీంతో వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో సూర్యాపేట, తాండూరు సహా 12 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. భూపాలపల్లి, హైదరాబాద్ బోడుప్పల్‌లోని ఆయన నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. జయరాజుకు సంబంధించిన ఆస్తులు, కీలక పత్రాలపై ఏసీబీ ఆరా తీస్తోంది. తనిఖీల్లో జయరాజుకు సంబంధించిన కీలక పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి..: Mir Alam Lake Tourism | మీర్ ఆలం చెరువును పర్యాటక కేంద్రంగా మార్చాలి : సీఎం రేవంత్‌రెడ్డి