అక్షరటుడే, వెబ్‌డెస్క్: Badsi Shekhar Goud Birthday | తెలంగాణ Telangana రాష్ట్ర గీత పారిశ్రామిక సహకార సంఘం ఛైర్మన్ బాడ్సి శేఖర్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా గౌడ సంఘం, యువజన సంఘం నాయకులు ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్‌లోని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు.
Badsi Shekhar Goud Birthday | గౌడ కులస్తుల అభ్యున్నతి కోసం
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గీత కార్మికుల సంక్షేమం, గౌడ కులస్తుల అభ్యున్నతి కోసం బాడ్సి శేఖర్ గౌడ్ చేస్తున్న సేవలను కొనియాడారు. ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గౌడ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ గౌడ్, జిల్లా గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి రాజ గౌడ్, జిల్లా నాయకులు అంతగోడల శ్రీనివాస్ గౌడ్, ప్రేమ్‌చంద్ గౌడ్, యువజన నాయకులు రంజిత్ గౌడ్, రవి గౌడ్, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..