అక్షరటుడే వెబ్‌డెస్క్: CEC Appointment Law | ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన 2023 చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం భిన్న తీర్పు వెలువరించింది. ఈ కేసులను ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలా వద్దా అనే అంశంపై ఇద్దరు సభ్యుల ధర్మాసనంలో ఏకాభిప్రాయం కుదరలేదు.
2023లో కేంద్రం తెచ్చిన చట్టం ప్రకారం.. సీఈసీ, ఈసీల ఎంపిక కమిటీ నుంచి సుప్రీంకోర్టు ( Supreme Court ) ప్రధాన న్యాయమూర్తి (CJI)ని తొలగించారు. ప్రస్తుతం ఈ ప్యానెల్‌లో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత మాత్రమే సభ్యులుగా ఉంటున్నారు. గతంలో ఎంపిక ప్రక్రియలో సీజేఐ పాత్ర ఉండగా, ఇప్పుడు దానిని తొలగించడాన్ని సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
CEC Appointment Law | భిన్నాభిప్రాయాలు..
ఈ పిటిషన్లను విచారించిన ఇద్దరు సభ్యుల ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జస్టిస్ దీపాంకర్ దత్తా ఈ కేసును ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చారు. మరోవైపు, జస్టిస్ ఎస్‌సీ శర్మ మాత్రం ఈ సున్నితమైన అంశాన్ని ఐదుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి రిఫర్ చేయాలని అభిప్రాయపడ్డారు.
ఇలా ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలు చెప్పడంతో ఈ కేసులో సందిగ్ధం ఏర్పడింది. ఈ స్ప్లిట్ వెర్డిక్ట్ కారణంగా పిటిషన్లపై తుది నిర్ణయం వెంటనే వెలువడలేదు. తదుపరి న్యాయ ప్రక్రియ ద్వారా ఈ భిన్నాభిప్రాయాలను పరిష్కరించిన తర్వాతే దీనిపై స్పష్టత రానుంది.
ఇది కూడా చదవండి: Nizamabad IT Tower | ఐటీ టవర్ను సందర్శించిన కలెక్టర్ భవేష్ మిశ్రా