అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Ganesh Annadanam Nizamabad | నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఉన్న ‘శ్రీ ఓం గణేష్ మండలి’లో బుధవారం మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీపీ సాయిచైతన్య పాల్గొనగా మరో అతిథిగా అదనపు కలెక్టర్ భుజంగరావ్ విచ్చేశారు.
Ganesh Annadanam Nizamabad | అన్నదానంలో స్వయంగా వడ్డించిన సీపీ
మొదట పూజాకార్యక్రమం అనంతరం పోలీస్ కమిషనర్ (CP Sai Chaitanya), అదనపు కలెక్టర్ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు స్వయంగా చిన్నారులకు వడ్డించారు. ఈ అన్నదాన కార్య క్రమంలో పెద్ద మొత్తంలో స్నేహా సొసైటీ, గ్రేసీ ఆర్గనైజషన్ విద్యార్థులు, అదనపు డీసీపీ(అడ్మిన్) శుభం ప్రకాష్, అభిగ్యాన్ మాల్వియా (ఆర్మూర్ సబ్ కలెక్టర్), సురేష్ (అసిస్టెంట్ కలెక్టర్), సందీప్(ప్రొబేషనరి డిప్యూటీ కలెక్టర్), జిల్లా ఫైర్ ఆఫీసర్ పరమేశ్వర్, డీఎంహెచ్వో రాజశ్రీ, జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్ శ్రీకాంత్ రెడ్డి, టౌన్ ఏసీపీ ప్రకాష్, ఏఆర్ఏసీపీ కృష్ణ, సీటీసీ ఏసీపీ రాజశేఖర్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, సీఐలు, ఎస్సైలు, రిజర్వు ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Nizamabad IT Tower | ఐటీ టవర్ను సందర్శించిన కలెక్టర్ భవేష్ మిశ్రా