అక్షరటుడే, కోటగిరి : Police Duties | పోలీస్ ఇమేజ్ పెంచే విధంగా ప్రతీ సిబ్బంది నిక్కచ్చిగా విధులు నిర్వహించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) సూచించారు. కోటగిరి(Kotagiri) పోలీస్ స్టేషన్ను గురువారం ఆయన సందర్శించారు.
Police Duties | ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం..
సీపీ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇచ్చారు. కోటగిరి పీఎస్ పరిధిలోని రికార్డ్లను పరిశీలిస్తూ.. అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసుల వివరాలను తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల చేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ప్రతి కేసులో నాణ్యమైన, ఇన్వెస్టిగేషన్ చేయాలని సబ్ ఇన్స్పెక్టర్కు సూచనలు చేశారు. ఈ పోలీస్ స్టేషన్ మహారాష్ట్రకు సరిహద్దులో ఉన్నందున వాహనాల రాకపోకలపై ఎల్లప్పుడూ నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రుద్రూర్ సీఐ శ్రీ కృష్ణ , కోటగిరి ఎస్సై శ్రీనివాస్ యాదవ్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: నా లైఫ్లో కాస్లీయెస్ట్ ఫిలిం