Religious Teachings Schools | స్కూళ్లలో మతపరమైన బోధనలు.. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్

హైదరాబాద్‌ సైదాబాద్‌లోని ‘సక్సెస్’ అనే ప్రైవేట్ పాఠశాలలో మతపరమైన బోధనలు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Religious Teachings Schools | హైదరాబాద్‌ (Hyderabad) సైదాబాద్‌లోని ‘సక్సెస్’ అనే ప్రైవేట్ పాఠశాలలో మతపరమైన బోధనలు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. హిందూ విద్యార్థులకు ‘కల్మా’, ‘సురా ఫతేహా’ చదవాలని హోంవర్క్ ఇవ్వడంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

Religious Teachings Schools | ఏం జరిగింది?

స్కూల్ డైరీలో కల్మా చదవాలని హోంవర్క్ ఇచ్చిన విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. అయితే, తమ పాఠశాలలో ఇది తప్పనిసరి అని యాజమాన్యం సమాధానం ఇవ్వడంతో వివాదం మరింత ముదిరింది. వెంటనే బీజేపీ (BJP) నేతలతో కలిసి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో బీజేపీ నేతలు పాఠశాలను ముట్టడిస్తామని హెచ్చరించడంతో, పోలీసులు భారీగా చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. స్కూల్‌కు వెళ్లే దారులను తాత్కాలికంగా మూసివేశారు.

Religious Teachings Schools | యాజమాన్యం వివరణ..

ఈ ఘటనపై స్పందించిన స్కూల్ యాజమాన్యం, ఇది పొరపాటున జరిగిందని తెలిపింది. కల్మా చదవాలని హోంవర్క్ ఇచ్చిన టీచర్‌ను విధుల్లోంచి తొలగించామని, ఇలాంటి ఘటనలు తమ పాఠశాలలో ఎప్పుడూ జరగలేదని వివరణ ఇచ్చింది.

Religious Teachings Schools | రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం..

Religious Teachings Schools

ఈ వివాదంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. హిందూ విద్యార్థులను ఇస్లాం వైపు మళ్లించేలా ప్రైవేట్ స్కూళ్లలో కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్షించి, బాధ్యులైన టీచర్లు, యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి వారిని జైలుకు పంపిస్తేనే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కావని రాజాసింగ్ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి..: Hyderabad Diesel Buses | హైదరాబాద్​లో డీజిల్​ బస్సులు తొలగిస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *