అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Police | గుండెపోటుతో వృద్ధుడు మృతి చెందాడు. అయితే కన్నతండ్రిని కుమార్తె కుటుంబమే హత్య చేసిందని ఆరోపిస్తూ కోడలు పోలీసులకు (Kamareddy Police) ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కామారెడ్డి (Kamareddy) మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో కలకలం రేపింది.
Kamareddy Police | చిన్న మల్లారెడ్డి గ్రామంలో..
ఫిర్యాదుదారు లావణ్య తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గద్దె నారాయణను నాలుగు నెలల క్రితం కుమార్తె విమల వృద్ధాశ్రమంలో చేర్పించింది. బుధవారం మధ్యాహ్నం నారాయణను విమల ఇంటికి తీసుకురాగా.. అదే రాత్రి ఆయనకు గుండెపోటు వచ్చిందని చెబుతూ ముందుగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, తర్వాత ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. అక్కడ వైద్యులు పరీక్షించి నారాయణ మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
అయితే విషయం ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు విమల కుటుంబ సభ్యులు ప్రయత్నించడంతో కోడలు గద్దె లావణ్య అడ్డుకుంది. ఆస్తి కోసమే మామ నారాయణను కుమార్తె విమల, ఆమె కుటుంబ సభ్యులు హత్య చేశారని ఆరోపిస్తూ దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో (Devunipalli Police Station) లావణ్య ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: July 16 Gold Prices | బంగారం ధరల్లో మళ్లీ పెరుగుదల.. 24 క్యారెట్ల గ్రాము గోల్డ్ ఎంతంటే!