Ambati Rambabu Case | మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Ambati Rambabu Case | మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, సిబ్బందిని నెట్టివేశారని ఆయనపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

Ambati Rambabu Case |  ప్రభుత్వ లాంఛనాలతో..

ముద్రగడ పద్మనాభం ( Mudragada Padmanabham )అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ముద్రగడ కుటుంబ సభ్యులు దీనిని తిరస్కరించి, తమ నిర్ణయం మేరకే అంత్యక్రియలు జరగాలని స్పష్టం చేశారు. ఈ గందరగోళం మధ్యలోనే పోలీసులు ప్రభుత్వ లాంఛనాల కోసం ఏర్పాట్లు చేశారు.

ambati.1

Ambati Rambabu Case | అభ్యంతరం వ్యక్తం చేస్తూ..

అంత్యక్రియల సమయంలో గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తున్న తరుణంలో అంబటి రాంబాబు, మరికొందరు వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఆ సమయంలో తమను నెట్టివేయడంతో పాటు విధులకు ఆటంకం కలిగించారని ఏఆర్ ఎస్సై అప్పలరాజు, కానిస్టేబుళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబుతో పాటు మరికొందరిపై BNS 132, 3(5) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి, కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:  Kia Syros EV | ఒక్క చార్జ్‌తో 526 కి.మీ.. కియా సైరోస్ ఈవీ ఎంట్రీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *