MI vs CSK | ఐపీఎల్‌లో నేడు ‘ఎల్ క్లాసికో’.. ముంబై – చెన్నై హై వోల్టేజ్ ఫైట్‌కు వాంఖడే వేదిక

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్: MI vs CSK | ఐపీఎల్ చరిత్రలో అత్యంత హైప్ ఉన్న పోరులలో ఒకటైన ముంబై ఇండియన్స్ – చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ముంబైలోని వాంఖడే స్టేడియం (Wankhede Stadium) వేదికగా ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌ (Jio Hotstar)లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు కలిపి పది సార్లు టైటిల్స్ గెలుచుకోవడం వీటి ప్రాభవాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ముంబై ఇండియన్స్ ఐదు ట్రోఫీలు గెలుచుకోగా, చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. దీంతో ఈ పోరును అభిమానులు ‘ఎల్ క్లాసికో’గా పరిగణిస్తున్నారు.

MI vs CSK | పాయింట్ల పట్టికలో కీలక మ్యాచ్

ఈ సీజన్‌లో 33వ మ్యాచ్‌గా జరుగుతున్న ఈ పోరులో ఇరు జట్లు సేమ్ సిట్యుయేషన్‌లో ఉన్నాయి. ముంబై ఇండియన్స్ ఆరు మ్యాచ్‌లలో రెండు విజయాలు, నాలుగు ఓటములతో ఏడో స్థానంలో ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్ కూడా అదే రికార్డుతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. అయితే నెట్ రన్‌రేట్‌లో తేడా వల్ల స్థానాల్లో మార్పు వచ్చింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఐదో స్థానానికి ఎగబాకే అవకాశం ఉండటంతో పోరు మరింత ఉత్కంఠగా మారింది.

MI vs CSK | హెడ్ టు హెడ్ రికార్డ్

ఐపీఎల్ (IPL) చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 39 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. అందులో ముంబై ఇండియన్స్ 21 మ్యాచ్‌లు గెలిచి స్వల్ప ఆధిక్యం సాధించగా, చెన్నై సూపర్ కింగ్స్ 18 విజయాలు నమోదు చేసింది. అయితే ఇటీవల జరిగిన ఆరు మ్యాచ్‌లలో సీఎస్కే స్పష్టమైన ఆధిపత్యం చూపించింది. ఆ ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట చెన్నై గెలిచింది.

MI vs CSK | జట్ల అంచనా

ముంబై ఇండియన్స్ జట్టు: క్వింటన్ డికాక్, దానిష్ మలేవర్, నమన్ ధీర్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), షెర్ఫేన్ రూధర్‌ఫోర్డ్, క్రిష్ భరత్, మిచెల్ శాంట్నర్, విల్ జాక్స్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డివాల్డ్ బ్రెవిస్, జెమీ ఓవర్టన్, ఎంఎస్ ధోనీ, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, గుర్‌జపనీత్ సింగ్.

MI vs CSK | ఉత్కంఠభరిత పోరుకు సిద్ధం

గత సీజన్‌లో ఇరు జట్లు ఒక్కో మ్యాచ్ గెలుచుకోవడంతో ఈసారి పోరు మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత ఫామ్, గత రికార్డులు, స్టార్ ప్లేయర్ల ప్రదర్శన అన్నీ కలిపి చూస్తే ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు నిజమైన పండుగగా మారనుంది. మొత్తంగా, వాంఖడే వేదికగా జరగబోయే ఈ ‘మినీ వార్’లో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఇది కూడా చదవండి..: Bangladesh vs Srilanka | బంగ్లాదేశ్ మహిళల జట్టు 165 పరుగులకు ఆలౌట్.. స‌త్తా చాటిన శ్రీలంక బౌలర్లు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *