అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana Heatwave Alert | రాష్ట్రంలో మళ్లీ ఎండలు దంచి కొడుతున్నాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో (Unseasonal Rains) కాస్త చల్లబడిన వాతావరణం.. మళ్లీ వేడెక్కింది. గురువారం నుంచి ఎండ తీవ్రత పెరగనుంది. అయితే శుక్రవారం నుంచి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
రాష్ట్రంలో రేపటి నుంచి హీట్‌వేవ్ (Heatwave) మొదలు కానుంది. ఏప్రిల్ 24-29 వరకు భానుడు భగభగ మండుతాడు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, గద్వాల, వనపర్తి జిల్లాల్లో 43 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది. దీంతో ఆ జిల్లాలకు అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల మధ్య టెంపరేచర్ రికార్డు అయ్యే ఛాన్స్ ఉంది.
Telangana Heatwave Alert | హైదరాబాద్‌లో…
హైదరాబాద్ (Hyderabad) తీవ్రమైన వడగాలుల బారిన పడనుంది. ఏప్రిల్ 24-29 తేదీల మధ్య కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 43°Cకి చేరవచ్చు. వేడి కారణంగా అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఈ వర్షాలతో గాలిలో తేమ పెరిగి ఉక్కపోతను పెంచుతాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లొద్దు. నీరు ఎక్కువగా తాగాలి. జంక్ ఫుడ్, మద్యపానం, దూమపానానికి దూరంగా ఉండాలి. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లాల్సి వస్తే తలకు ఎండ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇది కూడా చదవండి..: RTC Strike Issues | కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె.. ప్రైవేట్ వాహనాల దోపిడీ

