అక్షరటుడే వెబ్డెస్క్: Amit Shah Sonia Gandhi | కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్షా తీవ్ర ఆరోపణలు గుప్పించారు. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా వందేమాతరం పూర్తి గేయాన్ని ఆలపించకుండా సోనియా అడ్డుకున్నారని విమర్శించారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే జాతీయ గేయాన్ని అవమానించారని మండిపడ్డారు. ఈ చర్య సిగ్గుచేటని పేర్కొన్న ఆయన, దేశ ప్రజలు ఆ పార్టీని ఎప్పటికీ క్షమించరని హెచ్చరించారు. వందేమాతరాన్ని అవమానించినందుకు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని అమిత్షా డిమాండ్ చేశారు. రాజస్థాన్లోని చిత్తోర్గఢ్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Amit Shah Sonia Gandhi | పర్యటనలో నిరసనలు..
మరోవైపు, అమిత్షా పర్యటన నేపథ్యంలో రాజస్థాన్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆయన ర్యాలీ సందర్భంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన 24 మంది కాంగ్రెస్ నేతలు, పలువురు విద్యార్థులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. దేశంలో పేపర్ లీకేజీలు, దిల్లీలో విద్యార్థులపై జరుగుతున్న దాడుల అంశాలపై కేంద్రమంత్రి స్పందించాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళనకు సిద్ధమయ్యారు. అయితే పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. ఈ అరెస్టులకు నిరసనగా వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, విద్యార్థులు పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
कांग्रेस और सोनिया गांधी जी को ‘वंदे मातरम’ का अपमान करने के लिए देश से माफी मांगनी चाहिए!
– माननीय केंद्रीय गृह मंत्री श्री @AmitShah जी pic.twitter.com/vbPAJhM1uB
— Manjinder Singh Sirsa (@mssirsa) August 16, 2026
ఇది కూడా చదవండి: Dimaagi Naxals | ‘మేధో నక్సల్స్’ వ్యాఖ్యలు వారిని ఉద్దేశించి కాదు : కేంద్ర మంత్రి