Thermal Power Plant | థర్మల్​ పవర్​ ప్లాంట్​ల వద్ద ఉద్రిక్తత

భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల వద్ద బీఆర్​ఎస్​ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Thermal Power Plant | రాష్ట్రంలో థర్మల్ విద్యుత్​ కేంద్రాల సందర్శనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. పవర్​ ప్లాంట్​ల వద్దకు వెళ్లిన గులాబీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

రాష్ట్రంలో విద్యుత్​ కోతలకు నిరసనగా తమ పార్టీ బృందాలు పవర్​ ప్లాంట్లను సందర్శిస్తాయని కేటీఆర్​ (KTR) బుధవారం తెలిపారు. ఈ మేరకు గురువారం ఉదయం భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సందర్శనకు వెళ్లిన బీఆర్ఎస్ బృందాన్ని అడ్డుకుని, లోపలకి వెళ్లకుండా పోలీసులు ఆపారు. దీంతో పవర్ ప్లాంట్ ఎదుట మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇతర బీఆర్ఎస్ నాయకులు ఆందోళ చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Thermal Power Plant | యాదాద్రి పవర్ ప్లాంట్ వద్ద..

యాదాద్రి పవర్​ ప్లాంట్​ వద్దకు వెళ్లిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుల బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరోవైపు లక్డీకాపుల్ వద్ద ఉన్న సింగరేణి హెడ్ ఆఫీస్​ను సైతం సందర్శిస్తామని బీఆర్​ఎస్​ నాయకులు పేర్కొన్నారు. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. సింగరేణిలో జరుగుతున్న అక్రమాలపై నిజాలను తెలుసుకునేందుకు, హెడ్ ఆఫీసును మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఇతర బీఆర్ఎస్ నాయకులు సందర్శించడానికి వస్తామన్నారు.

ఇది కూడా చదవండి..: Danam Nagender | సుప్రీంకోర్టులోనూ దానం నాగేందర్‌కు చుక్కెదురు..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *