Danam Nagender | సుప్రీంకోర్టులోనూ దానం నాగేందర్‌కు చుక్కెదురు..

దానం నాగేందర్​కు సుప్రీంకోర్టు షాక్​ ఇచ్చింది. అనర్హత విషయంలో హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఆయన పిటిషన్​ను కొట్టివేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Danam Nagender | దానం నాగేందర్​కు సుప్రీంకోర్టు (Supreme Court)లో చుక్కెదురైంది. హైకోర్టు తీర్పును చీఫ్​ జస్టిస్​ సూర్యకాంత్​ నేతృత్వంలోని ధర్మాసనం సమర్థించింది. దానం నాగేందర్ పిటిషన్ కొట్టివేసింది.

దానం నాగేందర్​పై హైకోర్టు అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. ఆయన పార్టీ మారినట్లు ఆధారాలు ఉన్నాయని న్యాయస్థానం, స్పీకర్​ తీర్పును కొట్టివేసింది. దానంపై వేటు వేయడంతో పాటు ఖైరతాబాద్​ స్థానం ఖాళీ అయినట్లు పేర్కొంది. ఈ తీర్పుపై దానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై గురువారం విచారణ చేపట్టిన ధర్మాసనం ఆయనకు షాక్​ ఇచ్చింది. దానం నాగేందర్​ పిటిషన్​ను కొట్టివేసింది.

Danam Nagender | ఎన్నికలకు వెళ్లండి

అనర్హత వేటు పడిందని, మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని దానం నాగేందర్​కు సుప్రీంకోర్టు సూచించింది. దీంతో ఖైరతాబాద్​ స్థానం ఖాళీ అయింది. దీంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది.కాగా దానం నాగేందర్​ బీఆర్​ఎస్​ నుంచి ఖైరతాబాద్​ ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి రావడంతో ఆయన పార్టీ మారారు. అంతేగాకుండా కాంగ్రెస్​ నుంచి సికింద్రాబాద్​ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో బీఆర్​ఎస్​, బీజేపీ ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్​ను కోరాయి. అయితే పార్టీ మారినట్లు ఆధారాలు లేవని అనర్హత వేయకుండా స్పీకర్​ పిటిషన్​ను కొట్టివేశారు. దీనిపై బీజేపీ, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించడంతో స్పీకర్​ నిర్ణయాన్ని పక్కన పెట్టిన ధర్మాసనం దానం నాగేందర్​పై అనర్హత వేటు వేసింది. దీనిని సవాల్​ చేస్తూ దానం సుప్రీం కోర్టుకు వెళ్లగా అక్కడ కూడా చుక్కెదురైంది.

ఇది కూడా చదవండి..: Telangana Red Alert | వాయుగుండం ఎఫెక్ట్​.. పలు జిల్లాలకు రెడ్​ అలర్ట్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *