Jharkhand Road Accident | రోడ్డు ప్రమాదంలో మంత్రి కూతురు మృతి

జార్కండ్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంత్రి కూతురు మృతి చెందారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Jharkhand Road Accident | జార్ఖండ్ (Jharkhand)​లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ట్రక్కును వేగంగా వచ్చిన కారు ఢీకొంది. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో మంత్రి కూతురితో సహా నలుగురు మృతి చెందారు.

జంషెడ్‌పూర్‌లో గురువారం తెల్లవారుజామున ఉన్న ట్రక్కును కారు ఢీకొంది. ప్రమాదంలో జార్ఖండ్ మంత్రి దీపికా పాండే సింగ్ కుమార్తె త్రిషతో సహా నలుగురు చనిపోయారు. మృతుల్లో సార్థక్ అగర్వాల్, నమన్ గుప్తా, వంశిక ఖండేల్‌వాల్​ ఉన్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో కారులోని నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. కారు సైతం నుజ్జునుజ్జు అయింది. ట్రక్కు చెడిపోవడంతో హైవేపై డివైడర్‌కు ఆనుకుని కుడి వైపున నిలిపి ఉంచారు. దాని వెనకాల చిన్న వేపకొమ్మ మాత్రమే పెట్టారు. రోడ్డుపై ఎటువంటి రిఫ్లెక్టర్ సంకేతాలు కనిపించలేదు. దీంతో వేగంగా వచ్చిన కారు దానిని ఢీకొంది.

Jharkhand Road Accident | గవర్నర్​, సీఎం సంతాపం

ప్రమాదంపై జార్ఖండ్ గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సంతాపం తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మంత్రి దీపికా పాండే సింగ్ కుమార్తె అకాల మరణం కలచివేసేందని గంగ్వార్ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో తన సహచర మంత్రి, సోదరి దీపికా పాండే సింగ్ కుమార్తె, ఇతర వ్యక్తులు మరణించారన్న వార్త తన హృదయాన్ని తీవ్ర వేదనకు గురిచేసిందని సీఎం హేమంత్​ సోరెన్​ అన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Seva Sankalp Yatra | భవిష్యత్ భారత నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకం:  ప్రధాని మోదీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *