అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana Red Alert | బంగళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం సైతం తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
రాష్ట్రం (Telangana)లో రానున్న 24 గంటల్లో ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి – కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాలు, ఆసిఫాబాద్, పెద్దపల్లిలో విస్తృతంగా అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఉదయం నుంచే వాతావరణం మేఘావృతమై ఉంది. పలు చోట్ల వర్షం పడుతోంది. సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయి. నల్గొండ, భువనగిరి, సిద్దిపేట, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డిలో విస్తారంగా మోస్తరు వర్షాలు కురుస్తాయి. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి – మోస్తరు జల్లులు కురిసే ఛాన్స్ ఉంది.
Telangana Red Alert | దంచికొట్టిన వాన
వాయుగుండం ప్రభావంతో గత 24 గంటల్లో పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. ముఖ్యంగ ఖమ్మం జిల్లాలో అతి భారీ వర్షాలు కురిశాయి. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో అత్యధికంగా 130.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో 114, హన్మకొండ జిల్లా ధర్మసాగర్లో 110.3, జనగామ జిల్లా చిల్పూరులో 110, మహబూబాబాద్ నెల్లికుదురులో 108.8 మి.మీ. వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంలో సైతం సాయంత్రం పూట భారీ వర్షం పడటంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
ఇది కూడా చదవండి..: Tank Bund Hit And Run | ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్.. ఎస్ఐ దుర్మరణం!