Weather Update | నేడు రాష్ట్రానికి భారీ వర్ష సూచన

అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Update | అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలో వానలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేడు మధ్యాహ్నం తర్వాత పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు.

రాష్ట్రంలో కొంతకాలంగా వరుణుడు ముఖం చాటేశాడు. చిరు జల్లులు తప్పా భారీ వానలు లేవు. దీంతో పాటు వేసవిని తలపించేలా ఎండలు కొట్టాయి. దీంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు. మరోవైపు పంటలకు సాగు నీరందక ఎండుముఖం పడుతున్నాయి. వర్షాల కోసం రైతులు (Farmers) నిత్యం ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నేటి నుంచి వానలు పడుతాయని అధికారులు చెప్పడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Weather Update | మధ్యాహ్నం తర్వాత..

అల్ప పీడన ప్రభావంతో సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు ప్రాంతాల్లో రాత్రి పూట విస్తృతంగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో సాయంత్రం నుండి మరుసటి రోజు ఉదయం వరకు అక్కడక్కడ జల్లులు కురుస్తాయి.

Weather Update | ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

అల్ప పీడన ప్రభావం రాష్ట్రంపై ఈ నెల 12 నుంచి 14 వరకు అధికంగా ఉంటుంది. ఆ రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఉమ్మడి ఆదిలాబాద్​, ఉమ్మడి నిజామాబాద్​, ఉమ్మడి కరీంగనర్​, ఉమ్మడి వరంగల్​, ఉమ్మడి ఖమ్మం, మెదక్​, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడుతాయి.

ఇది కూడా చదవండి..: NSUI Telangana | ఎన్ఎస్​యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వరద బట్టు వేణురాజ్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *