NSUI Telangana | ఎన్ఎస్​యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వరద బట్టు వేణురాజ్

ఎన్ఎస్​యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వరద బట్టు వేణురాజ్ నియమితులయ్యారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: NSUI Telangana | ఎన్ఎస్​యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వరద బట్టు వేణురాజ్(Varadabattu Venuraj) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది.

NSUI Telangana | కష్టపడ్డవారికి పార్టీలో గుర్తింపు..

నిజామాబాద్​ (Nizamabad) నగరానికి చెందిన వరదబట్టు వేణురాజ్ ప్రస్తుతం ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తాజాగా ఆయనను రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడిగా నియమించింది. ఈ సందర్భంగా వేణురాజ్ మాట్లాడుతూ.. తనను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించిన జాతీయ, రాష్ట్ర కమిటీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

గిరిరాజ్ కళాశాలలో ఎన్ఎస్​యూఐ నాయకుడిగా పనిచేసిన వేణురాజ్​ అనంతరం జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. వేణురాజ్​ను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించడంపై జిల్లా ఎన్​ఎస్​యూఐ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: బిగ్ బాస్ నుంచి.. ఫస్ట్ ఎలిమినేషన్ అతడేనా..! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *