Asmita Khelo India Cycling | నిజామాబాద్‌లో రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలు

నిజామాబాద్​ నగరంలో ఈనెల 27, 28 తేదీలలో అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్ – రోడ్ సైక్లింగ్పో టీలు నిర్వహించనున్నట్లు జీవీ కృపాకర్ రెడ్డి, భూలోకం విజయ్ కాంత్ రావు తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Asmita Khelo India Cycling | జిల్లా సైక్లింగ్​ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 27, 28 తేదీలలో నిజామాబాద్ జిల్లా (Nizamabad District) కేంద్రంలో “అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్ – రోడ్ సైక్లింగ్” పోటీలు నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జీవీ కృపాకర్ రెడ్డి, భూలోకం విజయ్ కాంత్ రావు తెలిపారు. గురువారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Asmita Khelo India Cycling | ఆసక్తి పెంచేందుకు..

మహిళల్లో సైక్లింగ్ క్రీడపై ఆసక్తిని పెంపొందించడం, వారి ప్రతిభను వెలికితీయడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. మహిళా ఎలైట్ విభాగంలో 19 నుండి 40ఏళ్ల మధ్య ఉన్న మహిళలు అర్హులని తెలిపారు. ​జూనియర్ బాలికల విభాగంలో 15 నుండి 18ఏళ్ల వయస్సు గల బాలికలు (2008-2011 మధ్య జన్మించిన వారు) అర్హులని పేర్కొన్నారు.

Asmita Khelo India Cycling | ​నిబంధనలివే..

క్రీడల్లో ​పాల్గొనే క్రీడాకారిణులు తమ సొంత సైకిళ్లు, రక్షణ పరికరాలను తెచ్చుకోవాలని ప్రతినిధులు పేర్కొన్నారు. పోటీదారులకు ‘ఖేలో ఇండియా గుర్తింపు సంఖ్య’ (KID) తప్పనిసరని.. గుర్తింపు సంఖ్య లేనివారు ‘ఎన్ఎస్ఆర్ఎస్’ అంతర్జాల వేదిక ద్వారా నమోదు చేసుకుని గుర్తింపు పొందాకే పోటీలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ​విజేతలకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలతో పాటు ప్రతిభా పత్రాలు అందజేస్తామన్నారు. ​ఈ సమావేశంలో సంఘం ఉపాధ్యక్షుడు రాజ్‌కుమార్, సుబేదార్ సూర్యప్రకాష్, కోశాధికారి సురేందర్ పాల్గొన్నారు. పూర్తి వివరాలకు జనరల్ సెక్రటరీ బి. విజయ్ కాంత్ రావు (9912883331)ను సంప్రదించాలని సూచించారు.

ఇది కూడా చదవండి..: Hospital Safety Standards | చిన్న పిల్లల ఆస్పత్రుల్లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేకదృష్టి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *