Red Cross Election Nomination | రసవత్తరంగా రెడ్​క్రాస్​ ఎన్నికలు.. నామినేషన్​ వేసిన జగన్​ మోహన్​ గౌడ్​..

రెడ్​క్రాస్​ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రసవత్తరంగా సాగుతోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Red Cross Election Nomination | రెడ్​క్రాస్​ ఎన్నికల (Red Cross Election) నామినేషన్ల ప్రక్రియ రసవత్తరంగా సాగుతోంది. ఈ సందర్భంగా పలువురు ఔత్సాహికులు తమ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.

Red Cross Election Nomination | ఎగ్జిక్యూటివ్​ మెంబర్​ పోస్టుకు..

అక్టోబర్ 4వ తేదీన జరగనున్న నిజామాబాద్ (Nizamabad) జిల్లా రెడ్​క్రాస్ సొసైటీ మేనేజ్​మెంట్​ కమిటీ ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్​గా పోటీ చేసేందుకు న్యాయవాది మల్లెపూల జగన్మోహన్​ గౌడ్​ ముందుకొచ్చారు. గురువారం రెడ్​క్రాస్ జిల్లా కార్యాలయంలో నామినేషన్​ దాఖలు చేశారు. ఆయన మాట్లాడుతూ రెడ్​క్రాస్ సేవలను జిల్లాలో ఇంకా మరింత పటిష్టం చేయడం కోసం కృషి చేస్తానన్నారు. సేవా కార్యక్రమాలను విస్తృతం చేయడంతో పాటు ప్రజలకు ఎల్లవేళలా రక్తాన్ని అందించే విధంగా.. జిల్లాలో అనేక సేవాకార్యక్రమాలు నిర్వహించేందుకు శాయాశక్తులా కృషి చేస్తానన్నారు. రెడ్​క్రాస్ సొసైటీ సభ్యులు తనకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: ఉత్తరాంధ్రను వణికిస్తున్న భారీ వర్షాలు నిరంతరం సమీక్షిస్తున్న ఏపీ సీఎం

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *